నెల్లూరులో హెలికాప్టర్ కలకలం.. వివాదాస్పదమవుతున్న ల్యాండింగ్...

Bukka Sumabala   | Asianet News
Published : Oct 29, 2020, 02:43 PM IST
నెల్లూరులో హెలికాప్టర్ కలకలం.. వివాదాస్పదమవుతున్న ల్యాండింగ్...

సారాంశం

నెల్లూరు జిల్లా, అనంతసాగరం మండలం రేవూరులో ఓ హెలికాప్టర్ ల్యాండింగ్ కలకలం రేపింది. ఓ ఎన్నారై ఇంట్లో పెళ్లి హెలికాప్టర్ లో రావడం, స్కూల్ గ్రౌండ్ లో హెలికాప్టర్ ల్యాండింగ్ ఇదంతా ఇప్పుడు అధికారులకు చేతినిండా పని పెట్టింది. కారణమేంటంటే..

ఎక్కడైనా హెలికాప్టర్ ల్యాండ్ కావాలంటే ఏవియేషన్ అనుమతితో పాటు స్థానిక అధికారులు అనుమతి తప్పనిసరి. కానీ, నెల్లూరు జిల్లా రేవూరులో అవేవి లేకుండానే హెలికాప్టర్ ల్యాండ్ అయింది. కారులో వచ్చినట్టు ఎంచక్కా హెలికాప్టర్ వేసుకొని పెళ్లికి వచ్చేసాడు.

రేవూరులో జనార్దన్ రెడ్డి అనే ఎన్నారై ఇంట్లో పెళ్లికి, హైదరాబాద్ లో ఉంటున్న  సినీ నిర్మాత, మాజీ ఏవియేషన్ అధికారి రామకోటేశ్వర రావు హెలికాప్టర్‌లో వచ్చాడు. దీనికి ఎలాంటి అనుమతులు లేకుండా, స్కూల్ హెడ్ మాస్టర్ ఎన్ఓసి తీసుకుని ల్యాండ్ అయ్యాడు. దీనిపైఅధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. 

ఈ నెల 27న  గ్రామానికి చెందిన ఎన్నారై బోవెళ్ల జనార్దన్ రెడ్డి  ఆహ్వానం మేరకే హెలికాప్టర్ లో కుటుంబ సమేతంగా రామకోటేశ్వర రావు వచ్చినట్టు తెలుస్తోంది. స్థానిక జిల్లా పరిషత్ స్కూల్ లో ల్యాండ్ అయిన హెలికాప్టర్ అందులో ఉన్న వ్యక్తులు ను దింపి వెళ్ళిపోయింది. అయితే అందులో ఓ మహిళ కు ఆరోగ్యం బాగలేకపోవడం వలనే ఇలా హెలికాప్టర్ లో వచ్చినట్టు తెలుస్తోంది. ఏదీ ఏమైనా హెలికాప్టర్ ఘటనని అధికారులు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
PREV
click me!

Recommended Stories

RK Roja Comments on Chandrababu Super Six: సూపర్ సిక్స్ – సూపర్ ప్లాప్ | Asianet News Telugu
నగరిలోచంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ | RK Roja Sensational Comments on Chandrababu | Asianet News Telugu