యూకే నుండి గుంటూరు జిల్లాకు వచ్చిన ఆరుగురిలో ఒకరికి కరోనా సోకినట్టుగా అధికారులు గుర్తించారు. యూకే నుండి వచ్చిన వారిని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు.
గుంటూరు: యూకే నుండి గుంటూరు జిల్లాకు వచ్చిన ఆరుగురిలో ఒకరికి కరోనా సోకినట్టుగా అధికారులు గుర్తించారు. యూకే నుండి వచ్చిన వారిని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు.
కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ తరుణంలో యూకే నుండి ఇండియాకు విమానాలను రద్దు చేసిన విషయం తెలిసిందే.
undefined
గుంటూరు నుండి యూకే ఈ నెల 10వ తేదీన జిల్లాకు వచ్చారు. జిల్లాకు వచ్చిన ఆరుగురిని వైద్య శాఖాధికారులు గుర్తించారు. జిల్లాలోని పిడుగురాళ్ల, జానపాడు, పందిటివారిపాలెం వాసులుగా గుర్తించారు అధికారులు.
యూకే నుండి జిల్లాకు వచ్చిన ఆరుగురితో పాటు వారి కుటుంబసభ్యులు, స్థానికులకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఒకరికి కరోనా పాజిటివ్ సోకిందని చెప్పారు.
కరోనా పాజిటివ్ సోకిన మహిళను ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు.స్ట్రెయిన్ వేగంగా విస్తరిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. కొత్త రకం వైరస్ విషయంలో దేశంలోని పలు రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు.