ఏపీలో ఎస్టీ కమీషన్ ఏర్పాటు... జగన్ సర్కార్ కీలక నిర్ణయం

Published : Dec 28, 2020, 04:34 PM IST
ఏపీలో ఎస్టీ కమీషన్ ఏర్పాటు... జగన్ సర్కార్ కీలక నిర్ణయం

సారాంశం

రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం ఎస్టీల కోసమే ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు 
చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆమోదంతో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటయ్యింది. ఈ మేరకు ప్రభుత్వం  ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి  మాట్లాడుతూ... ప్రత్యేక ఎస్టీ కమిషన్ కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి  జగన్‌ గిరిజనులకు ఇచ్చిన హామీ నెరవేర్చారని, గిరిజన హక్కులు కాపాడేందుకు ఎస్టీ కమిషన్ తీసుకొచ్చారని ఆమె తెలిపారు. సీఎం జగన్‌కు గిరిజనులంతా రుణపడి ఉంటారని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: స్థానిక ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. బీసీలకు 40 శాతం సీట్లు
రంపచోడవరం నియోజకవర్గంలో సామాన్యుడిలా పవన్ అడవితల్లిబాట | Adavi Thallibata 2.0 Launch