మృగాడు.. రెండేళ్ల చిన్నారి..బుగ్గలు,కాళ్లు, చేతులు కొరికేశాడు.. ప్రియురాలి కూతురికి చిత్రహింసలు...

Published : Feb 18, 2022, 06:38 AM IST
మృగాడు.. రెండేళ్ల చిన్నారి..బుగ్గలు,కాళ్లు, చేతులు కొరికేశాడు.. ప్రియురాలి కూతురికి చిత్రహింసలు...

సారాంశం

ముద్దులొలికే చిన్నారిని ముద్దాడాల్సింది పోయి.. బుగ్గల్ని కసిగా కొరికేశాడు. పాదాలకు మట్టి అంటకుండా చూసుకోవాల్సింది పోయి.. పాశవింకంగా ప్రవర్తించాడు.. ఓ మృగాడి చేతిలో రెండేళ్ల చిన్నారి విలవిల్లాడిపోయింది. చివరికి స్థానికుల చొరవతో...

విజయనగరం : అభం.. శుభం తెలియని ఆ చిన్నారి ముద్దులొలికే పలుకులు వింటే ఎవరైనా పరవశించాలి... చిట్టి పాదాలు సవ్వడి చేస్తే మురిపెంగా మురిసిపోవాలి... కానీ ఈ కర్కశుడిలో మాత్రం మృగత్వం మేల్కోంది... ఆ చిన్నారిని చూస్తే వాడితో ప్రేమ పొంగాల్సింది పోయి.. కర్కశత్వం కట్టలు తెంచుకుంది. విచక్షణ మరికి ప్రవర్తించాడు. కన్నకూతురిలా  చూసుకోవాల్సినవాడే రాక్షసుడిలా మారాడు.. 2 years old చిన్నారికి నరకం చూపించాడు..

తన lover 2 ఏళ్ల daughterను ఏడు నెలలుగా Tortureకు గురి చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... విజయనగరం కొత్తకోట సమీపంలో ఉన్న 26 ఏళ్ల 
Married womanను భర్త వదిలేశాడు. ఆమెకు రెండేళ్ల చిన్నారి ఉంది. కూలి పనులు చేసుకుని బతుకుతుంది. ఈ క్రమంలో నెల్లిమర్లలో ఓ శుభకార్యంలో ఆమెకు ఓప్రైవేట్ ఎలక్ట్రీషియన్ చిన్నా (29)తో పరిచయం ఏర్పడింది. అది Symbiosisకి దారితీసింది. ఇద్దరూ ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

అప్పటినుంచి చిన్నా కన్ను.. ఆమె రెండేళ్ల కూతురి మీద పడింది.. ఏడు నెలలుగా బాలికను కొట్టడం, రక్కడం వంటి వికృత చేతులకు చిన్నా పాల్పడుతున్నా ఆమె అడ్డు చెప్పలేదు. కానీ, బుధవారం రాత్రి తల్లి ఇంట్లో లేనప్పుడు పాప బుగ్గలు, కాళ్లు, చేతులను చిన్నా కొరికేసాడు. ఆమె ఇంటికి వచ్చేసరికి పాప ఏడుస్తుంది. చుట్టుపక్కలవారు ఏమైంది.. అని అడిగితే విషయాన్ని దాటవేసింది. అంగన్వాడి సిబ్బందికి విషయం తెలియడంతో స్థానిక మహిళా సంరక్షణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లి ఫిర్యాదు మేరకు చిన్నాను రిమాండ్ కు తరలించారు దిశ డీఎస్పీ టి. త్రినాథ్ తెలిపారు. బాలికను వైద్య చికిత్సలకు ఆసుపత్రికి తరలించామని, తల్లికి వ్యక్తిత్వ, మానసిక నిపుణుల వద్ద కౌన్సెలింగ్ చేయిస్తామని చెప్పారు. 

ఇదిలా ఉండగా..  కొండలపై బతికే Tribals తమ పిల్లలు ఉన్నతంగా చదువు కోవాలని పాఠశాలలకు పంపిస్తే..ఇద్దరు Teachers మాత్రం కీచకులుగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థినులను తాకుతూ, అసభ్యకర ఫోటోలు తీశారు. వీరి ఆగడాలను భరించలేక పోయిన బాలికలు,  తల్లిదండ్రులు కలిసి ఉపాధ్యాయుల దుశ్చర్యలను ప్రస్తావిస్తూ తీసిన వీడియో Social mediaల్లో వైరల్ కావడంతో విషయం వెలుగు చూసింది. vizianagaram జిల్లా  గుమ్మలక్ష్మీపురం మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 92 మంది students చదువుతున్నారు. ఇక్కడ  నలుగురు ఉపాధ్యాయులు ఉండగా ప్రధానోపాధ్యాయుడు స్వామి నాయుడు, ఉపాధ్యాయుడు సూర్యనారాయణపై  బాలికలు ఆరోపణలు చేస్తున్నారు.

ఒంటరిగా ఉన్న సమయాల్లో శరీరాన్ని తాకుతూ ఉన్నారని, Kissలు పెడుతున్నారని, కురచ దుస్తుల్లో వెడితే ఫోటోలు తీస్తున్నారని వాపోతున్నారు. Yoga classes పేరిట పైన చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తిస్తూ.. తల్లిదండ్రులకు చెప్పొద్దని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. గ్రామాన్ని సందర్శించి.. గ్రామస్తులు, పాఠశాల కమిటీ సభ్యులతో ఆమె మాట్లాడారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. 

PREV
click me!

Recommended Stories

ధవళేశ్వరం బ్యారేజ్ పరిశీలించిన సీఎం చంద్రబాబు | Sir Arthur Cotton Barrage Gate Renovation
పిచ్చుకులంకలో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Naidu Speech at Dowleswaram Barrage