లంచం: ఏపీలో ఏసీబీకి చిక్కిన ఇద్దరు వీఆర్ఓలు

By narsimha lode  |  First Published Sep 28, 2022, 5:04 PM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఏసీబీకి ఇద్దరు వీఆర్ఓలు పట్టుబడ్డారు. వేర్వేరు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో వీఆర్ఓలు దొరికారు. పాస్ పుస్తకాల కోసం డబ్బులు తీసుకొంటూ వీఆర్ఓలు ఏసీబీకి చిక్కారు.



అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం నాడు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన ఏసీబీ దాడుల్లో ఇద్దరు వీఆర్ఓలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అనకాపల్లి జిల్లా ములగపూడి గ్రామ సచివాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పాస్ పుస్తకాల కోసం రైతు నుండి రూ. 40 వేలు చెల్లించాలని రైతును వీఆర్ఓ డిమాండ్ చేశారు. అయితే రూ. 20 వేలు రైతు నుండి వీఆర్ఓ తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గుంటూరు మేడికొండూరు మండలం వరగానిలో ఏసీబీ దాడులు జరిగాయి. రూ. 8 వేలు లంచం తీసుకొంటూ వీఆర్ఓ ఏసీబీకి పట్టుబడ్డాడు.

గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏసీబీ దాడుల్లో పలువురు  చిక్కారు. తెలంగాణలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్యాలయంలో బుల్లెట్ బండి సాంగ్ తో ఫేమ్ అయిన ఆశోక్  ఈ నెల 20వ తేదీన ఏసీబీకి చిక్కాడు. ఇంటి పర్మిషన్ కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశాడు.  లంచం తీసుకొంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు.

Latest Videos

undefined

కర్నూల్   మున్సిపల్ కార్పోరేషన్ లో ఈఏడాది జూన్ 30వ తేదీన ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ ఎస్ఈ సురేంద్ర ఏసీబీ అధికారులకు చిక్కారు.   కాంట్రాక్టర్ నుండి రూ. 15 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు  ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

alsor ead:పోలీసులకు లంచం ఇవ్వడానికి కుమార్తెలను అమ్ముకుంటున్నారు .. సొంత సర్కారు మీద ప్రజ్ఞా ఠాకూర్‌ సంచ‌ల‌నవ్యాఖ్య‌లు

తెలంగాణలోని  ఘట్ కేసర్ సబ్ రిజిస్ట్రార్ సీతారాంను ఈ ఏడాది జూన్ 7న  ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.  రూ. 70 వేలు అంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ అధికారులకు చిక్కాడు.  అవుషాపూర్ లో గ్రామ కంఠానికి చెందిన రెండు ఫ్లాట్స్ ను రిజిస్ట్రేషన్ చేసేందుకు రిజిస్ట్రార్ సీతారాం లంచం డిమాండ్ చేశాడు. లంచం తీసుకుంటూ సబ్ రిజిష్ట్రార్ ఏసీబీకి చిక్కాడు. హైద్రాబాద్ శంషాబాద్ లో  సంగారెడ్డి మండల  పంచాయితీ అధికారి సురేందర్ రెడ్డి ఇంట్లో ఈ ఏడాది మే 12న  ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సురేందర్ రెడ్డికి భారీగా అక్రమాస్తులు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.

click me!