కడప జిల్లాలో దారుణం.. రైలు కింద పడి ఇద్దరు యువతుల ఆత్మహత్య..

Published : Jan 31, 2022, 05:00 PM IST
కడప జిల్లాలో దారుణం..  రైలు కింద పడి ఇద్దరు యువతుల ఆత్మహత్య..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లాలో (kadapa district) దారుణం చోటుచేసుకుంది. రైలు కింద దూకి ఇద్దరు యువతులు బలవన్మరణం చెందారు. రైల్వే గేట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లాలో (kadapa district) దారుణం చోటుచేసుకుంది. రైలు కింద దూకి ఇద్దరు యువతులు బలవన్మరణం చెందారు. రైల్వే గేట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు కింద పడటంతో.. ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరోకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతిచెందారు. మృతులను అనంతపురం జిల్లా యాడికి చెందిన కల్యాణి (18), పూజితగా (18) గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారా..?, ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని Kanpurలో టాట్ మిల్ క్రాస్‌రోడ్ సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు accident జరిగింది. electric bus అదుపు తప్పి అనేక మంది పాదచారులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. పలువురు గాయపడినట్లు స్థానిక పోలీసులు సమాచారం అందించారు.ఈ ప్రమాదంలో మూడు కార్లు, పలు బైక్‌లు కూడా ధ్వంసమయ్యాయి. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం వెతుకుతున్నామని తూర్పు కాన్పూర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ కుమార్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, కేసు దర్యాప్తు ప్రారంభించామని డీసీపీ తెలిపారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?