స్థానికత గడువు మరో రెండేళ్ల పెంపు: నోటిఫికేషన్ విడుదల

By telugu teamFirst Published Oct 12, 2019, 12:48 PM IST
Highlights

నూతన ఉత్తర్వుల ప్రకారం 2021 జూన్ 2వతారీఖు లోపు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చినవారు అక్కడ స్థానికతను పొందవచ్చు. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య ఉద్యోగావకాశాల్లో రేజర్వేషన్లు కల్పిస్తారు. 

న్యూఢిల్లీ: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వలసవచ్చేవారికి స్థానికతను కల్పించే గడువును కేంద్రం మరో రెండు సంవత్సరాలు పెంచింది. దీనికి సంబంధించి శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

రాష్ట్ర విభజనానంతరం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వలసవచ్చే వారికి స్థానికత కల్పించడానికి ప్రస్తుతమున్న 5 సంవత్సరాల గడువును ఏడేళ్లకు పెంచింది. దీనికి సంబంధించి కేంద్ర హోమ్ శాఖ నిన్న సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. 

దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ జున్ 2,2014 నుండి 7 సంవత్సరాలలోపు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వలసవచ్చినవారు స్థానీయత పొందడానికి అర్హులవుతారు. ఇరు రాష్ట్రాలు విడిపోయి 5సంవత్సరాలైనా విభజనాంశాలు ఒక కొలిక్కి రాకపోవడంవల్ల ఆంధ్రప్రదేశ్ కు చెందిన చాలామంది ఉద్యోగులు హైద్రాబాదుతో పాటు తెలంగాణలోని ఇతరప్రాంతాల్లో ఇంకా ఉండిపోయారు. 

ఈ సమస్య పరిష్కారం అయ్యేందుకు ఇంకా సమయం పట్టేలా ఉన్నందున ఉద్యోగులంతా సందిగ్ధంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జూన్ 2019తో ముగిసిన గడువును కేంద్రం మరో రెండేళ్లపాటు పెంచింది. తొలి ఉత్తర్వుల ప్రకారం 2017జూన్ 2తో గడువు ముగిసింది. తరువాత రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మరో రెండు సంవత్సరాలు పొడిగించింది. 

నూతన ఉత్తర్వుల ప్రకారం 2021 జూన్ 2వతారీఖు లోపు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చినవారు అక్కడ స్థానికతను పొందవచ్చు. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య ఉద్యోగావకాశాల్లో రేజర్వేషన్లు కల్పిస్తారు. 

click me!