విశాఖ ఏజెన్సీలో మందుపాతర పేలుడు: ఇద్దరు గిరిజనుల మృతి

By narsimha lodeFirst Published Aug 3, 2020, 5:58 PM IST
Highlights

విశాఖపట్టణంలోని ఏజెన్సీ ప్రాంతంలో  సోమవారం నాడు మందుపాతర పేలిన ఘటనలో ఇద్దరు గిరిజనులు మరణించారు.
 

విశాఖపట్టణం: విశాఖపట్టణంలోని ఏజెన్సీ ప్రాంతంలో  సోమవారం నాడు మందుపాతర పేలిన ఘటనలో ఇద్దరు గిరిజనులు మరణించారు. మృతులను మోహన్ రావు, అజయ్ కుమార్ గా గుర్తించారు. 

జిల్లాలోని కూంద్రం అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొంది. మందుపాతర పేలడంతో ఇద్దరు గిరిజనులు  అక్కడికక్కడే మరణించారు. 
ఏజెన్సీ ప్రాంతంలో ఇటీవల కాలంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు చోటు చేసుకొంటున్నాయి.  మావోలు పోలీసులను తప్పించుకొని పారిపోయారు. 

మావో  కీలక నేతలు తమ కాల్పుల్లో గాయపడి పారిపోయినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అయితే  పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన మందుపాతర అమర్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసుల కోసం అమర్చిన మందుపాతర పేలడంతోనే గిరిజనులు మృతి చెందారు.ఏపీతో పాటు తెలంగాణ ప్రాంతంలో కూడ మరోసారి మావోయిస్టులు బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగా రిక్రూట్ మెంట్ చేపట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మావోల కదలికల సమాచారం రావడంతో పోలీసులు కూంబింగ్ ను తీవ్రతరం చేశారు. ఈ కారణంగానే పోలీసులు, మావోల మధ్య కాల్పులు చోటు చేసుకొన్నాయి.

click me!