తెలుగు గంగ కాల్వలో పడి సాఫ్ట్ వేర్ ఇంజనీర్, మరొకరు మృతి

By SumaBala BukkaFirst Published Jan 27, 2022, 6:33 AM IST
Highlights

మల్లు విష్టు అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికులు ఇద్దరి మృతదేహాలను బయటికి తీసి నాయుడు పేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మృతుల్లో చైతన్య చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తుండగా, జగన్ డిప్లమా పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. 

నాయుడు పేట : nellore జిల్లా నాయుడు పేట మండలం పుదూరు గ్రామ సమీపంలోని తెలుగు గంగ కాల్వలో పడి ఇద్దరు మృతి చెందారు. పుదూరు గ్రామానికి చెందిన కొండారి చైతన్య (25), జగన్ (25) స్నానం చేసేందుకు Telugu Ganga canalలో దిగారు. ప్రమాదవశాత్తు లోపలికి వెళ్లిపోవడంతో ఈత రాక ప్రాణాలు కోల్పోయారు. 

మల్లు విష్టు అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికులు ఇద్దరి మృతదేహాలను బయటికి తీసి నాయుడు పేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మృతుల్లో చైతన్య చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తుండగా, జగన్ డిప్లమా పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. 

ఇదిలా ఉండగా, జనవరి 19న Nirmala జిల్లాలోని Kadem మండలం బెల్లాల్ వద్ద కాలువలో Auto బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఆరుగురున్నారు. ఆటో కాలువలో పడిపోగానే ఆటోలో ఉన్న ఆరుగురిలో బోడ మల్లయ్య, చీమల శాంత,  శంకరవ్వ లు మరణించారు.

కాగా, జనవరి 5న తెలంగాణ జగిత్యాల జిల్లాలో ఎస్సారెస్పీ కాకతీయ కాలువలోకి  కారు దూసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కాకతీయ కాలువలోకి దూసుకెళ్లిన కారును పోలీసులు జనవరి 5 బుధవారం ఉదయం క్రేన్ సాయంతో వెలికితీశారు. ఆ కారులో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వివరాలు.. జిల్లాలోని మెట్‌పల్లికి చెందిన గుండవేని ప్రసాద్, పుదరి రేవంత్‌‌లు.. తమ ఊరి నుంచి సమీపంలోని ఆత్మకూరుకు సోమవారం రాత్రి బయలుదేరారు. అయితే మరసటి రోజు ఉదయం అయిన కూడా వారు ఆత్మకూరు చేరుకోలేదు. వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. 

దీంతో పోలీసులు రంగంలోకి దిగి మెట్‌పల్లి నుంచి వెల్లుల్ల మార్గంలో తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఆ మార్గంలో అందుబాటులో సీసీ టీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆ మార్గంలో వెల్లుల్ల శివారులోని కాకతీయ కాలువ ఉన్న వంతెన రెయిలింగ్ కూలిపోయి ఉండటం గురించి పోలీసులకు సమాచారం అందింది. ఈ వంతెనపై నుంచే మెట్‌పల్లి నుంచి ఆత్మకూరు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో పోలీసులు కారు రెయిలింగ్‌ను ఢీకొని కాకతీయ కాల్వలోకి దూసుకెళ్లి ఉంటుందని అనుమానించారు. 

ఈ క్రమంలో  శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాలువకు నీటి విడుదలను ఆపించారు. ఈరోజు తెల్లవారే సరికి కాకతీయ కాలువలో నీటి ప్రవాహం తగ్గడంతో గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టగా.. కారును గుర్తించారు. మూడు గంటలపాటు శ్రమించిన గజఈతగాళ్లు, పోలీసులు.. ఎట్టకేలకు ఇద్దరి మృతదేహాలు, కారును వెలికితీశారు. 

కారును బయటకు తీసేందుకు పోలీసులు క్రేన్‌ను వినియోగించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎస్సారెస్పీ కాల్వలో కారు పడిన విషయం తెలుసుకున్న వెల్లుల్ల సమీప గ్రామాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకన్నారు. ఇక, ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

click me!