ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఛార్జీలపై 20 శాతం డిస్కౌంట్, కొత్త ధరలు ఇవే

By Siva KodatiFirst Published Jan 26, 2022, 5:00 PM IST
Highlights

కృష్ణా జిల్లా (krishna district) నుంచి హైదరాబాద్ (hyderabad) వెళ్లేవారికి , అటు నుంచి ఇటు వచ్చే వారికి ఏపీఎస్ఆర్టీసీ (apsrtc) శుభవార్త చెప్పింది. దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల ఆదరణ పొందేందుకు గాను కృష్ణా జిల్లా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు.

కృష్ణా జిల్లా (krishna district) నుంచి హైదరాబాద్ (hyderabad) వెళ్లేవారికి , అటు నుంచి ఇటు వచ్చే వారికి ఏపీఎస్ఆర్టీసీ (apsrtc) శుభవార్త చెప్పింది. దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల ఆదరణ పొందేందుకు గాను కృష్ణా జిల్లా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా కృష్ణా జిల్లా – హైదరాబాద్ మధ్య చార్జీలను తగ్గించాలని నిర్ణయించారు. కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌కు నడిచే అన్ని రకాల ఏసీ బస్సుల్లో 20 శాతం చార్జీలను (discount) తగ్గించాలని నిర్ణయించారు.

ఇంద్ర, అమరావతి, గరుడ, నైట్ రైడర్, వెన్నెల స్లీపర్ బస్సుల్లో చార్జీలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్లేవారికి ఆదివారం మినహా అన్నీ రోజుల్లో చార్జీలు తగ్గించనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. అలాగే హైదరాబాద్ నుంచి కృష్ణా జిల్లాకు వచ్చేవారికి శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో చార్జీలు తగ్గింపు వుంటుందని తెలిపింది. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, ఆటోనగర్ డిపోలకు చెందిన బస్సుల్లో హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే బస్సుల్లో రాయితీ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 28 వరకు రాయితీలు వర్తిస్తాయని కృష్ణా జిల్లా రీజియన్ మేనేజర్ వెల్లడించారు. 

గుడివాడ నుంచి హైదరాబాద్ BHELకు ఇంద్ర బస్సులో చార్జీ రూ.610 నుండి రూ.555కు తగ్గింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు అమరావతి బస్సు చార్జీ రూ.650 వుండగా.. అది రూ. 535కి తగ్గించింది. ఇదే రూట్‌లో గరుడ బస్సు చార్జీని రూ.620 నుంచి రూ.495కు తగ్గించింది. వెన్నెల స్లీపర్ బస్సు చార్జీ రూ.730 నుంచి రూ.590కి తగ్గించింది. ఆర్టీసీ నిర్ణయంతో ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

click me!