కృష్ణా జిల్లాలో అమానుషం : తీర్పు ధిక్కరించినందుకు.. ఊరి నుంచి రెండు కుటుంబాల వెలి

Siva Kodati |  
Published : Jun 06, 2023, 04:02 PM IST
కృష్ణా జిల్లాలో అమానుషం : తీర్పు ధిక్కరించినందుకు.. ఊరి నుంచి రెండు కుటుంబాల వెలి

సారాంశం

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం అన్నవరం గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తీర్పును ధిక్కరించినందుకు గాను రెండు కుటుంబాలను గ్రామం నుంచి వెలి వేశారు వూరి పెద్దలు

ఓ వైపు భారతదేశం శాస్త్ర , సాంకేతిక రంగాల్లో అగ్రరాజ్యాల్లో పోటీపడుతున్నా.. దేశంలో ఇంకా కట్టుబాట్లు, మూఢనమ్మకాలతో అమానుష ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో గ్రామ పెద్దల తీర్పును ధిక్కరించినందుకు గాను రెండు కుటుంబాలను వూరి నుంచి వెలివేశారు. మోపిదేవి మండలం అన్నవరం గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థల వివాదంలో పెద్ద తీర్పును ధిక్కరించినందుకు గాను వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. తక్షణం 2 కుటుంబాలను గ్రామం నుంచి వెలివేస్తున్నట్లు చాటింపు వేయించిన పెద్దలు.. వారితో ఎవరైనా మాట్లాడితే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దీంతో బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన మరిని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

విజయవాడ సంక్రాంతి వేడుకల్లో MP Kesineni Sivanath | Sankranthi Muggulu | Asianet News Telugu
22 AP Youth Rescued from Cyber-Slavery in Myanmar: కరెంటు షాక్ పెట్టేవాళ్ళు | Asianet News Telugu