కుప్పంలో టీడీపీ ఓటమిపై జేసీ సంచలన వ్యాఖ్యలు

Published : Feb 23, 2021, 12:00 PM IST
కుప్పంలో టీడీపీ ఓటమిపై జేసీ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

 ఏ ఎన్నికలైనా డబ్బులు లేకుంటే గెలవడం సాధ్యం కాదని మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి  అభిప్రాయపడ్డారు.

అనంతపురం:  ఏ ఎన్నికలైనా డబ్బులు లేకుంటే గెలవడం సాధ్యం కాదని మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి  అభిప్రాయపడ్డారు.

మంగళవారం నాడు అనంతపురంలో  నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.అభివృద్ధిని చూసి ఓటు వేస్తారనుకొంటే పొరపాటేనని ఆయన చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందన్నారు.

రాజకీయాలు కలుషితమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఏపీలో పోలీసుల రాజ్యం నడుస్తుందని ఆయన ఆరోపించారు. పోలీసులే ఓట్లు వేయిస్తున్నారని ఆయన విమర్శించారు.

అభివృద్ధిని చూసి ఓటు వేస్తారనుకొంటే పొరపాటేనని ఆయన చెప్పారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను బ్రహ్మాండంగా  అభివృద్ధి చేశారని.. అయినా వైసీపీతో పోటీ పడి డబ్బులు ఇవ్వలేక ఓడిపోయారన్నారు. డబ్బుల ప్రభావంతోనే వైసీపీ విజయం సాధిస్తోందని ఆయన చెప్పారు.

అక్కడ అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు కూడా భయబ్రాంతులకు గురిచేశారని ఆయన ఆరోపించారు. అభివృద్ధి చూసి వైసీపీకి ఓటేశారని చెప్పడం అబద్ధమన్నారు. చంద్రబాబు ఎలాంటి వారో..? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వారో..? ప్రజలందరికీ బాగా తెలుసన్నారు.దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!