కడప జిల్లాలో ఘోర ప్రమాదం: లారీ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం

Published : Jun 07, 2020, 01:25 PM IST
కడప జిల్లాలో ఘోర ప్రమాదం: లారీ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం

సారాంశం

కడప జిల్లా దువ్వూరు వద్ద డివైడర్ ను లారీని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. కడప జిల్లా దువ్వూరు వద్ద ఆదివారం నాడు ఉదయం అతి వేగంతో లారీ డివైడర్‌ను ఢీకొంది.  దీంతో లారీ రోడ్డుకు పక్కన బోల్తా పడింది.


 కడప: కడప జిల్లా దువ్వూరు వద్ద డివైడర్ ను లారీని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. కడప జిల్లా దువ్వూరు వద్ద ఆదివారం నాడు ఉదయం అతి వేగంతో లారీ డివైడర్‌ను ఢీకొంది.  దీంతో లారీ రోడ్డుకు పక్కన బోల్తా పడింది.

దీంతో వెంటనే లారీకి వెంటనే మంటలు అంటుకొన్నాయి. ఆ సమయంలో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్లు లారీ నుండి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.  అయితే వారిద్దరూ కూడ లారీ నుండి బయటకు రాలేకపోయారు. లారీకి వేగంగా మంటలు వ్యాపించాయి.

తమను రక్షించాలని కూడ వీరిద్దరూ అరిచారు. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే పోలీసులు, స్థానికులు లారీకి అంటుకొన్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు.ఈ లారీలోనే లారీ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు