విజయవాడ గ్యాంగ్‌వార్‌లో ట్విస్ట్: మంగళగిరికి చెందిన ఇద్దరు రౌడీ షీటర్ల అరెస్ట్

By narsimha lodeFirst Published Jun 7, 2020, 12:38 PM IST
Highlights

విజయవాడ గ్యాంగ్‌వార్‌లో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగు చూస్తన్నాయి. ఈ గొడవలో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు రౌడీషీటర్ల హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరిని కూడ అరెస్ట్ చేశారు.


విజయవాడ: విజయవాడ గ్యాంగ్‌వార్‌లో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగు చూస్తన్నాయి. ఈ గొడవలో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు రౌడీషీటర్ల హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరిని కూడ అరెస్ట్ చేశారు.

గత నెల 30వ తేదీన తోటవారి వీధిలో సందీప్, పండు గ్యాంగ్‌ల మధ్య జరిగిన ఘర్షణలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సందీప్ మరణించాడు. ఆసుపత్రిలో ప్రస్తుతం పండు చికిత్స పొందుతున్నాడు.

సందీప్ హత్య కేసులో విజయవాడ పోలీసులు ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేశారు. మరో వైపు రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగిన ఘర్షణ గురించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సందీప్ గ్యాంగ్‌ను కూడ పోలీసులు విచారిస్తున్నారు.

also read:బెజవాడ గ్యాంగ్ వార్: పండు ముఠా దాడిలోనే సందీప్ మృతి, అరెస్టయిన 13 మంది వీరే...

ఈ రెండు గ్రూపుల మధ్య గొడవకు భూ వివాదమే కారణంగా పోలీసులు తేల్చి చెప్పారు. మరోవైపు మంగళగిరికి చెందిన ఇద్దరు రౌడీషీటర్లు కూడ  ఈ గొడవలో పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు. 

మంగళగిరికి చెందిన ఎ. వీరవెంకట రఘునాథ్, మేకతోటి అనే రౌడీషీటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో పండు తల్లి పాత్రపై కూడ  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సందీప్ గ్యాంగ్ కు సంబంధించిన వారిని కూడ రేపు పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

click me!