బొబ్బిలి కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు: ఇద్దరు మృతి

Published : Jun 14, 2019, 01:10 PM IST
బొబ్బిలి కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు: ఇద్దరు మృతి

సారాంశం

విజయనగరం జిల్లా బొబ్బిలిలో బాలాజీ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడుతో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం నాడు జరిగింది.  


విజయనగరం: విజయనగరం జిల్లా బొబ్బిలిలో బాలాజీ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడుతో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం నాడు జరిగింది.

బొబ్బిలిలోని గ్రోత్ సెంటర్‌లోని బాలాజీ కెమికల్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం నాడు ఈ పేలుడు చోటు చేసుకొంది. అయితే బాయిలర్ పేలుడుకు కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు.  గాయపడిన ఇద్దరు కార్మికులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ఫ్యాక్టరీలో సరైన ప్రమాణాలు పాటించడం లేదని కార్మికులు చాలా కాలంగా ఫిర్యాదులు చేస్తున్నారని సమాచారం. 

PREV
click me!

Recommended Stories

IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి, ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు