కుప్పంలో వెల్డింగ్ షాపులో గ్యాస్ సిలిండర్ పేలుడు: ఇద్దరు మృతి

Published : May 10, 2020, 06:11 PM IST
కుప్పంలో వెల్డింగ్ షాపులో గ్యాస్ సిలిండర్ పేలుడు: ఇద్దరు మృతి

సారాంశం

చిత్తూరు జిల్లా కుప్పం  మండలం తంబీగానిపల్లిలో గ్యాస్ సిలిండర్  పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం  మండలం తంబీగానిపల్లిలో గ్యాస్ సిలిండర్  పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబీగానిపల్లిలో ఓ వెల్డింగ్ షాపులో ఓ వాహనానికి ఆదివారం నాడు వెల్డింగ్ పనులు నిర్వహిస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.  ఈ ఘటనలో మరో వ్యక్తి గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

గ్యాస్ సిలిండర్ పేలగానే స్థానికులు భయంతో పరుగులు తీశారు. లాక్ డౌన్ కారణంగా చాలా రోజులుగా వెల్డింగ్ దుకాణం తీయలేదు. లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతో ఓ వాహనానికి వెల్డింగ్ పనులను ఇవాళ నిర్వహించారు.

ఈ పనులు నిర్వహించే సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఇంత కాలం దుకాణం తెరవని కారణంగా గ్యాస్ లీకై ఉంటుందనే పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.లాక్ డౌన్ తర్వాత దుకాణాలు తెరిచిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు