ట్రావెల్స్ బస్సులో రూ. 2 కోట్లు అక్రమరవాణా..

Published : Apr 01, 2022, 11:56 AM ISTUpdated : Apr 01, 2022, 12:01 PM IST
ట్రావెల్స్ బస్సులో రూ. 2 కోట్లు  అక్రమరవాణా..

సారాంశం

బస్సు సీట్ల కింద, లగేజీ  క్యారియర్ లో అక్రమంగా రూ.2 కోట్ల నగదును తరలిస్తున్న ట్రావెల్స్ బస్సును పోలీసులు సీజ్ చేశారు. ఈ డబ్బు అసలా? నకిలీవా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

గోపాలపురం : West Godavari జిల్లా నల్లజర్ల మండలం Toll Plaza వద్ద భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేటు బస్సులో పోలీసులు తనిఖీలు నిర్వహించగా 2 కోట్ల నగదు పట్టుబడింది. వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా నుంచి గుంటూరు వెళ్తున్న పద్మావతి ట్రావెల్స్ కు చెందిన ఏపీ 39టీబీ 7555 నెంబర్ గల బస్సులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలో బస్సు సీట్ల కింద లగేజ్ క్యారియర్ లో భారీగా నగదు  తరలిస్తుండడాన్ని గమనించారు. దీనికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో బస్సు డ్రైవర్, క్లీనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పట్టుబడిన నోట్లు నకిలీవా? నిజమైనవేనా?  అనే కోణంలో దర్యాప్తు కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, మార్చి 6న తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి తమిళనాడులోని కోయంబత్తూరుకు గుట్టుగా తరలిస్తున్న కిలోలకొద్దీ బంగారం, వెండితో పాటు భారీ నగదు ఏపీ పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. దాదాపు ఐదు కోట్ల రూపాయల విలువైన సొత్తును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తుండగా స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఈ సొత్తుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్న అధికారులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెడుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ సొత్తును అక్రమంగా తరలిస్తున్నట్లు ఏపీ ఎస్ఈబీ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కర్నూలు పట్టణ శివారులోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద మాటు వేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అధికారులు అనుమానిస్తున్న ట్రావెల్స్ బస్సు చెక్ పోస్ట్ వద్దకు రాగానే ఆపి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన ఐదుగురు ప్రయాణికుల వద్ద భారీగా నగదుతో పాటు బంగారం, వెండి పట్టుబడింది. బస్సు సీట్ల కింద డబ్బుల కట్టలతో కూడిన బ్యాగులు, ప్రత్యేకంగా తయారు చేయించిన బనియన్లలో కిలోల కొద్దీ బంగారం, వెండిని పోలీసులు గుర్తించారు. ఈ సొత్తును స్వాధీనం చేసుకున్న అధికారులు పట్టుబడిన ఐదుగురిని కర్నూల్ పోలీసులకు అప్పగించారు. 

పట్టుబడిన సొత్తుకు సంబంధించిన వివరాలను ఎస్ఈబీ అధికారులు వెల్లడించారు. 8.250కిలోల బంగారు బిస్కెట్లు, 28.5కిలోల వెండితో పాటు రూ.90లక్షల నగదు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సొత్తుకు సంబంధించిన పత్రాలేవీ లేకపోవడంతో వీటిని తరలిస్తున్న దేవరాజు, మురుగేషన్, వెంకటేశ్, కుమారవేలు, సెల్వరాజులను అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించినట్లు ఎస్ఈబి అధికారులు వెల్లడించారు. ఇంత భారీమొత్తంలో డబ్బు. బంగారం, వెండి తరలింపు వెనక ఎవరున్నదీ దర్యాప్తులో తేలుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ సొత్తుకు సంబంధించిన సరయిన పత్రాలుంటే తిరిగి అప్పగించడంతో పాటు అరెస్ట్ చేసిన ఐదుగురిని విడుదల చేయనున్నట్లు ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్