ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు: తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ప్రారంభించిన జగన్

By narsimha lode  |  First Published Apr 1, 2022, 11:17 AM IST

గర్భిణులు, బాలింతల కోసం  రూపొందించిన వైఎస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ఏపీ సీఎం వైఎస్ జగన్  విజయవాడలో ప్రారంభించారు. ఇవాళ్టి నుండి 500 వాహనాలు  అందుబాటులోకి రానున్నాయి. 


విజయవాడ:ఆసుపత్రుల వ్యవస్థల రూపు రేఖల్ని మార్చి వేస్తున్నామని ఏపీ  సీఎం వైఎస్ జగన్ చెప్పారు. గర్భిణులు, బాలింతకు అందుబాటులోకి YSR తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను  ఏపీ ప్రభుత్వం ఇవాళ్టి నుండి అందుబాటులోకి తీసుకు వచ్చింది ఏపీ ప్రభుత్వం.  ఇవాళ విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో 500 Talli Bidda Express వాహనాలను సీఎం జగన్  జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం YS Jagan ప్రసంగించారు. తల్లీ బిడ్డకు ఈ వాహనాలు  శ్రీరామరక్ష అని  ఆయన పేర్కొన్నారు.అక్కాచెల్లెళ్లకు  ఈ వాహనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలు అందించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని సీఎం చెప్పారు. దేవుడి దయతో ఇవాళ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు..

Latest Videos

undefined

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మేరకు ఆసుపత్రుల్లో గర్భిణులు, బాలింతలకు మందులు అందిస్తున్నామన్నారు సీఎం జగన్. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లే సమయంలో  సిజేరియన్ చేసుకొన్న మహిళకు రూ. 2500, సాధారణ ప్రసవం అయిన మహిళకు రూ. 5వేలు అందిస్తున్నామన్నారు. 

గత ప్రభుత్వ హయంలో  వాహనాలు అందుబాటులో ఉండేవి కావన్నారు. 104, 108, తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను  ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.  
 

click me!