కారులో ఆడుకుంటుండగా.. డోర్స్ లాక్: ఇద్దరు చిన్నారులు మృతి

Siva Kodati |  
Published : Nov 17, 2020, 07:24 PM IST
కారులో ఆడుకుంటుండగా.. డోర్స్ లాక్: ఇద్దరు చిన్నారులు మృతి

సారాంశం

కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏ. కొండూరు మండలం రేపూడి తండాలో కారులో ఆడుకుంటూ ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన శ్రీనివాస్ (5), యమున (4) మరణించారు

కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏ. కొండూరు మండలం రేపూడి తండాలో కారులో ఆడుకుంటూ ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన శ్రీనివాస్ (5), యమున (4) మరణించారు.

వీరిద్దరూ కారులో ఆడుకుంటుండగా కారు డోర్స్ లాకయ్యాయి. బయటకొచ్చేందుకు పిల్లలు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. చివరికి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. వీరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?