భారీ వర్షాలతో ప్రమాదం... కరెంట్ షాక్ తో అన్నదమ్ముల మృతి

By Arun Kumar PFirst Published Oct 11, 2020, 2:29 PM IST
Highlights

విశాఖ జిల్లాలో ఆదివారం జరిగిన వేరు వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. 

విశాఖ జిల్లాలో కురుస్తున్న భారీవర్షాలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. విశాఖ జిల్లాలోని అచ్యుతాపురంలో విద్యుత్ షాక్ గురయి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలురు మృతి చెందారు. 

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విశాఖలో కురిసిన గాలివానకు అచ్యుతాపురంలోని ఓ ఇంటిపై ప్లెక్సీ పడింది. దీన్ని తొలగించడానికి ఆ ఇంట్లో నివాసముండే అన్నదమ్ములు యశ్వంత్(15), చరణ్(13)లు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ప్లెక్సీ విద్యుత్ వైర్లకు తగలడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ కు గరయ్యారు. తీవ్రంగా గాయపడిని వారిద్దరిని చికిత్స నిమిత్తం అనకాపల్లి హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యలోనే వారిద్దరు ప్రాణాలు విడిచారు.  

మరోవైపు విశాఖ నగరంలో అదుపుతప్పిన లారీ వాహనాలను ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం పాలవగా మరో ఆరుగురికి గాయాలపాలయ్యారు.  హనుమంతవాక జంక్షన్ లో మధురవాడ వైపు వెళ్తున్న లారీకి బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలు ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు కూడా గాయాలవగా వీరిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.  

click me!