విజన్ అంటే ఇదేనా.. విజయ్ సాయి, బుద్ధా వెంకన్నల మధ్య ట్విట్టర్ వార్...

Bukka Sumabala   | Asianet News
Published : Oct 10, 2020, 11:59 AM IST
విజన్ అంటే ఇదేనా.. విజయ్ సాయి, బుద్ధా వెంకన్నల మధ్య ట్విట్టర్ వార్...

సారాంశం

43 వేల కోట్ల ప్రజాధనం లూటీ చేసి,16 నెలలు చిప్పకూడు తిన్న జగన్ రెడ్డి గారిని విజన్ ఉన్న నాయకుడు అంటారా? టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా విజయ్ సాయి రెడ్డిపై విరుచుకుపడ్డారు.  

43 వేల కోట్ల ప్రజాధనం లూటీ చేసి,16 నెలలు చిప్పకూడు తిన్న జగన్ రెడ్డి గారిని విజన్ ఉన్న నాయకుడు అంటారా? టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా విజయ్ సాయి రెడ్డిపై విరుచుకుపడ్డారు.  

పోలవరం యాత్రకు ధనం వృధా చేసి ఉంటే మీ సైకో బ్యాచ్ ఊరుకుంటుందా? పోలవరం అనేది 7 దశాబ్దాల రాష్ట్ర ప్రజల కల.70 శాతం చంద్రబాబు గారు పూర్తి చేసారు కాబట్టి, కల సాకారం అవుతున్న దృశ్యాన్ని ప్రజలకు చూపించారు. మీ లాగా ఢిల్లీ వాళ్లకు 'ఫుట్ మసాజ్' చేయకుండా, రాష్ట్ర సమస్యల పై కేంద్రంతో పోరాడారు.ఖర్చుల్లో తేడా ఉంటే,ఏమి పీక్కుంటావో పీక్కో అంటూ మండిపడ్డారు.

స్కూల్ పిల్లలు వేసుకునే బెల్ట్ కి,సాక్స్ లకు కూడా వైకాపా రంగులు వేసుకునే నువ్వు దుబారా గురించి మాట్లాడుతున్నావా? అంటూ ఎద్దేవా చేశారు. అన్నట్టు 4 వేల కోట్ల తో పంచాయతీలకు వైకాపా రంగుల దుబారా మర్చిపోయావా? తాడేపల్లి ఇంటి కోసం రూ.16 కోట్లు, నాయన సమాధి కోసం రూ.27 కోట్లు, చచ్చు సలహాలు ఇచ్చే సలహాదారులకు 60 కోట్లు,సిబిఐ కోర్టుకు వెళ్లడానికి ప్రతీ వారం 60 లక్షలు, మీ కక్షలు తీర్చుకోవటానికి లాయర్ల ఫీజులంటూ వందల కోట్లు ,మీ అవినీతి పత్రికకు వందల కోట్లు, మీరు చేసే వేల కోట్ల దందాలు మొత్తం లెక్క తీస్తే, 10 పోలవరం ప్రాజెక్ట్లు కట్టవచ్చని అన్నారు. 

పేదలకు ఐదు రూపాయలకు అన్నం పెట్టడానికి చంద్రబాబు అన్న కాంటీన్లు పెట్టారు. వాటిని పీకేసిన జగన్ రెడ్డి రంగులు వేయడానికి... తీయడానికి 4000 కోట్లు తగులబెట్టారు. మేం పేదల కడుపు చూస్తాం. మీరు రంగుల లోకంలో విహరిస్తారు అంటూ టిడిపి నేత,మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు  ట్విట్టర్ లో విజయసాయి ట్వీట్ కి కౌంటర్ ఇచ్చాడు. 

PREV
click me!

Recommended Stories

ముద్రగడ పద్మనాభం ఇకలేరు | Mudragada Padmanabham Passes Away | Kapu Leaders Pressmeet
విశాఖ ఎయిర్ పోర్ట్ లో దిగిన జగన్.. భారీగా వచ్చిన ఫ్యాన్స్ ని చూసి షాక్ | Jagan Visakhapatnam Tour