మంత్రి బంధువు మోసం... అమలాపురం అమ్మాయి వీడియో... కుట్రగా తేల్చిన పోలీసులు (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Mar 09, 2021, 06:10 PM ISTUpdated : Mar 09, 2021, 06:15 PM IST
మంత్రి బంధువు మోసం... అమలాపురం అమ్మాయి వీడియో... కుట్రగా తేల్చిన పోలీసులు (వీడియో)

సారాంశం

అమలాపురం అమ్మాయి ఆరోపణలపై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేయగా సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి.  

అమలాపురం అమ్మాయి ఆంధ్రప్రదేశ్ మంత్రి బంధువు తనను మోసం చేశాడని ఒక వీడియో తీసి వైరల్ చేయటంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై అమలాపురం పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేయగా సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు తనను ఎవరు కూడా మోసం చేయలేదని, మోసం చేశానని ఆరోపణలు ఎదుర్కొన్న చెల్లుబోయిన ధనుష్ అనే వ్యక్తి అసలు మంత్రి బంధువు కాదని, అసలు ఆ ఆరోపణలు వచ్చిన వ్యక్తి పట్ల కూడా న్యాయస్థానం ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేసిందని అమలాపురం డిఎస్పీ తెలిపారు. 

2019లో ఈ వ్యవహారం జరిగిందని... అప్పుడు ఆమె ఆరోపణలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మూర్తి అప్పుడు ఇంకా మంత్రిగా లేరని డిఎస్పీ తెలిపారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కావాలనే ఎవరో కొందరు రాజకీయ వ్యక్తులు ఇలాంటి వీడియో ఆమెతో చేపించి వైరల్ చేశారని పోలీసులు తెలిపారు. 

వీడియో

మంత్రి ఇంటి పేరు, ఆమె ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఇంటి పేరు ఒకే విధంగా ఉండటంతో కొందరు రాజకీయ ప్రత్యర్థులు కావాలనే ఇదంతా చేశారని, ఈ వీడియో చేసిన అమ్మాయి పట్ల, దీని వెనక ఎవరున్నారో వారిని కూడా త్వరలో పట్టుకుంటామని అమలాపురం డిఎస్పీ చెప్పారు.ఈ వీడియో ను ఎవరు కూడా నమ్మవద్దని, ఎవరు వైరల్ చేయవద్దని తప్పుడు ఫేక్ వీడియోలు వైరల్ చేసిన వారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

read more వైసిపి లీడర్ కొడుకు చేతిలో మోసపోయా... అందుకే ఎన్నికల్లో పోటీ: యువతి ఆవేదన

దీనిపై ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మూర్తి కూడా అధికారిక ప్రకటన ఇచ్చారు. ఆ అమ్మాయితో ఎవరో కావాలనే రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి వీడియో తీయించారని, తనకు ప్రజల్లో వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేకే తన రాజకీయ ప్రత్యర్థులు ఇలాంటి నీచమైన కుట్రలకు పాల్పడి రోజు రోజుకు దిగజారుతున్నారని తెలిపారు. వారు ఎన్ని పన్నాగాలు పన్నిన ఏపీ ప్రజలు నమ్మరని నిజానిజాలు పోలీసులే నిగ్గు తేల్చారని చెప్పారు.


  
 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్