సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసు: సుప్రీం కీలక ఆదేశాలు

By narsimha lodeFirst Published Mar 9, 2021, 5:54 PM IST
Highlights

ఏపీ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కేసులో రోజువారీ విచారణ చేసి ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీలోపుగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

న్యూఢిల్లీ: ఏపీ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కేసులో రోజువారీ విచారణ చేసి ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీలోపుగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో సస్పెన్షన్ ఒక్కటే మార్గమా అని కోర్టు ప్రశ్నించింది. వేరే విభాగంలో పోస్టింగ్ ఇవ్వొచ్చు కదా అని అడిగింది. ఒకే ఒక్క ఆరోపణపై నేరుగా సస్పెన్షన్ విధించడంలో అర్ధం ఏమిటని ప్రశ్నించింది.ఆరోపణలు నిగ్గు తేల్చాక చర్యలు తీసుకొంటే బాగుండేదని సుప్రీం అభిప్రాయపడింది. 

అయితే ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది స్పందించారు. ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆరు నెలల గడువు కోరారు. సీనియర్ అధికారి సస్పెండ్ చేసి విచారణ పూర్తి చేయడానికి ఎంత కాలం తీసుకొంటారని ఆయన కోర్టు అడిగింది.

ఈ విషయమై దర్యాప్తు చేసేందుకు అధికారిని నియమించినట్టుగా సుప్రీంకోర్టుకు తెలిపింది.మొత్తం విచారణను ఏప్రిల్ 30 లోపుగా ముగించాలని ఆదేశించింది.
 

click me!