Andhra Pradesh Exit Polls 2024 : టివి9 ఎగ్జిట్ పోల్ సర్వేలో వైసిపిదే పైచేయి... ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే...

By Arun Kumar P  |  First Published Jun 1, 2024, 6:49 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో ఈసారి హోరాహోరీ తప్పేలా లేదు. టివి9 ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసిపి, టిడిపి కూటమికి సమానంగా లోక్ సభ సీట్లు వస్తాయని తేల్చింది. దీంతో అసెంబ్లీ లోనూ ఇలాంటి ఫలితం వుండే అవకాశం వుంది. 


అమరావతి : టివి9 పోల్ స్ట్రాట్ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఆంధ్ర ప్రదేశ్ లో హోరాహెరీ కనిపిస్తోంది. వైసిపి 13, టిడిపి 9, జనసేనకు 1, బిజెపికి 2 లొక్ సభ స్థానం వస్తుందని ఈ సర్వే తేల్చింది. మొత్తంగా ప్రతిపక్ష  కూటమికి 12 స్థానాలు వస్తాయని ఈ సర్వే తేల్చింది. ఇలాంటి పలితమే అసెంబ్లీ  ఎన్నికల్లో వుంటుందని అంచనా వేస్తోంది. 

ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. మొత్తం ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరిగితే నాలుగో విడతలో ఏపీ ఎన్నికలు జరిగాయి. మే 13న రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్ధానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగు దేశం-జనసేన-బిజెపి  కూటమి మధ్య ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగింది.  

Latest Videos

undefined

ఈ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో రికార్డుస్థాయిలో ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. పల్లెలతో పాటు పట్టణ ఓటర్లు కూడా పోలింగ్ బూత్ కు కదలి రావడంతో అర్థరాత్రి వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. దీంతో ఏకంగా 81.86 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఇలా ఓటేయడానికి ప్రజలు పోటెత్తడం ఎవరికి లాభిస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది.

అయితే ఏపీలో పోలింగ్ ముగిసిన నాటినుండి ఫలితాలపై చర్చ మొదలైంది. తమ పార్టీదే గెలుపంటే తమదే గెలుపని అటు వైసిపి, ఇటు టిడిపి కూటమి నాయకులు చెబుతున్నారు. ప్రజలు కూడా ఎవరి పక్షాన నిలిచారో అంతుచిక్కడం లేదు. దీంతో ఇవాళ తుది దశ లోక్ సభ పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి.  వీటిని తెలుగు ప్రజలే కాదు అభ్యర్థులు, పార్టీ పెద్దలు ఆసక్తిగా గమనిస్తున్నారు.  

 


 

click me!