ఒకే అమ్మాయిపై ఇద్దరి కన్ను: మిత్రుడిని నదిలోకి తోసేసి చంపేశారు

Published : Jan 05, 2020, 09:54 AM IST
ఒకే అమ్మాయిపై ఇద్దరి కన్ను: మిత్రుడిని నదిలోకి తోసేసి చంపేశారు

సారాంశం

ఓ అమ్మాయి విషయంలో తూర్పు గోదావరి తుని వద్ద తాండవ నదిలో మిత్రుడు రాజును ఇద్దరు యువకులు పడేసి చంపేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.

తుని: తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలో తాండవ నదిలో లభించిన గుర్తు తెలియని శవం మిస్టరీని పోలీసులు ఛేదించారు. కక్షతోనే మిత్రుడిని ఇద్దరు యువకులు తాండవ నదిలోకి తోసేశారని తుని రూరల్ సిఐ కిశోర్ బాబు చెప్పారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

కేసుకు సంబంధించిన వివరాలను సిఐ కిశోర్ బాబు మీడియా ప్రతినిధులకు శనివారం వివరించారు. గత నెల 22వ తేదీన తుని మండలం డి. పోలవరం, నందిఒంపు ప్రాంతాల మధ్య తాండవ నదిలో గుర్తు తెలియని వ్యక్తి శవం లభించింది. 

మృతుడిని తుని పట్టణం రాజీవ్ గృహకల్పకు చెందిన గీసాల రాజుగా గుర్తించారు. మృతుడి బంధువు కాపారపు విజయసత్యమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. 

రాజుకు స్నేహితుడైన మాకిరెడ్డి వెంకటేష్ కు ఓ అమ్మాయి విషయంలో వ్యక్తిగత కక్షలు ఉన్నాయి. దీంతో గత నెల 21వ తేదీన మిత్రుడు సబ్బవరపు ప్రసాద్ సాయంతో రాజును వెంకటేష్ పుట్టిన రోజు పార్టీ అని చెప్పి కొలిమేరు గ్రామశివారులోని తాండవ నది ఒడ్డుకు తీసుకుని వెళ్లారు. 

అక్కడ ముగ్గురు మద్యం సేవించారు. రాజుకు ఎక్కువగా మద్యం తాగించి నదిలోకి తోసేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

PREV
click me!

Recommended Stories

Anshu Malika Emotional Speech 🔥 RK Roja Daughter Wins Prestigious Award in USA | Asianet News Telugu
CM Chandrababu Birthday: చంద్రబాబుకి బర్త్ డే గిఫ్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత భోజనం | Asianet Telugu