
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం టోకెన్లను విక్రయిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను టీటీడీ విజిలెన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. భక్తుల ఫిర్యాదుతో కేవీఎం సంస్థలో పనిచేస్తున్న మస్తానయ్యను పట్టుకున్నారు విజిలెన్స్ పోలీసులు. అతని వద్ద నుంచి 76 ఉచిత లడ్డూ టోకెన్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాతు తెలియాల్సి వుంది.