సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం: విచారణకు మహిళ కమిషన్ చైర్ పర్సన్ ఆదేశం

By narsimha lodeFirst Published Nov 4, 2022, 5:28 PM IST
Highlights

సీఎం క్యాంప్  కార్యాలయం  సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం ఘటనపై  కాకినాడ  ఎస్పీని  విచారణ  చేసి నివేదిక ఇవ్వాలని మహిళా  కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి  పద్మ  ఆదేశించారు.
 


అమరావతి:ఆంద్రప్రదేశ్ సీఎం  వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లే దారిలో  ఆత్మహత్యాయత్నానికి  ప్రయత్నించిన  మహిళ కేసులో నివేదిక ఇవ్వాలని  కాకినాడ ఎస్పీని ఏపీ  మహిళా  కమిషన్  చైర్  పర్సన్  వాసిరెడ్డి సద్మ శుక్రవారంనాడు ఆదేశించారు.

ఈ నెల  2వ  తేదీన సీఎం ను కలిసేందుకు  ఆ మె క్యాంప్ కార్యాలయం  సమీపానికి  వచ్చారు.సీఎం  కలిసే అవకాశం లేకపోవడంతో  ఆమె ఆత్మహత్యాయత్నం  చేసింది.  వెంటనే ఆమెను పోలీసులు  ఆసుపత్రికి  తరలించారు. తన  కూతురు  అనారోగ్య కారణాలతో  తన ఇంటిని  విక్రయించుకొనే ప్రయత్నం  చేస్తే కొందరు అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపిస్తుంది. 

ఈ విషయమై ఫిర్యాదు  చేసినా ఫలితం  లేకపోవడంతో ఆత్మహత్యాయత్నం  చేసినట్టుగా  మీడియాలో  వార్తలు వచ్చాయి. ఈ  విషయమై సుమోటోగా  తీసుకుంది  రాష్ట్ర మహిళ  కమిషన్. ఈ ఘటన కు  సంబంధించిన అంశంపై  నివేదిక ఇవ్వాలని  కాకినాడ ఎస్పీని  మహిళా కమిషన్ ఆదేశించింది. 

also read:తాడేపల్లిలో సీఎం జగన్ క్యాంప్‌ ఆఫీసు సమీపంలో మహిళా ఆత్మహత్య యత్నం.. ఏం జరిగిందంటే..?

సీఎంక్యాంప్ కార్యాలయం సమీపంలో  మహిళ ఆరుద్ర ఆత్మహత్యాయత్నం  చేసిన  ఘటనపై  డీజీపీ  కార్యాలయం  కూడ  ఇదివరకే  ఓ  ప్రకటనను విడుదల చేసింది. మహిళ ఆరోపణలు చేసిన కానిస్టేబుల్  బదిలీ చేసినట్టుగా కూడ డీజీపీ కార్యాలయం ప్రకటించింది.  ఈ  అంశంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని  మహిళా కమిషన్ఁఆదేశాలు జారీ చేసింది.

click me!