టీటీడీ అర్చకుడు శ్రీనివాసాచార్యులు కరోనాతో మృతి

By narsimha lodeFirst Published Aug 6, 2020, 6:05 PM IST
Highlights

 కరోనాతో టీటీడీ అర్చకుడు శ్రీనివాసాచార్యలు గురువారం నాడు మరణించాడు. వారం రోజుల క్రితం ఆయన కరోనా చికిత్స కోసం ఆయన స్విమ్స్ లో చేరాడు.


తిరుమల: కరోనాతో టీటీడీ అర్చకుడు శ్రీనివాసాచార్యలు గురువారం నాడు మరణించాడు. వారం రోజుల క్రితం ఆయన కరోనా చికిత్స కోసం ఆయన స్విమ్స్ లో చేరాడు.

శ్రీనివాసాచార్యుల వయస్సు 45 ఏళ్లు.  గోవిందరాజస్వామి ఆలయం నుండి డిప్యూటేషన్ పై తిరుమలలో ఆయన పనిచేస్తున్నాడు. శ్రీనివాసాచార్యులు మరణించిన విషయాన్ని టీటీడీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

కరోనాతో మాజీ టీటీడీ ప్రధాన అర్చకుడు గత నెలలో మరణించాడు. తాజాగా డిప్యూటేషన్ పై పనిచేస్తున్న శ్రీనివాసాచార్యులు కూడ మృతి చెందడం కలకలం రేపుతోంది. తిరుమలలో కరోనా కేసులు నమోదు కావడంతో కఠినంగా ఆంక్షలను అమలు చేస్తోంది జిల్లా యంత్రాంగం. ఈ ఆంక్షలతో కేసుల నమోదు తగ్గినట్టుగా అధికారులు చెబుతున్నారు.

టీటీడీలో కూడ 170 మందికి పైగా ఉద్యోగులకు కరోనా సోకింది. వీరిలో కొందరు కరోనా నుండి కోలుకొని   విధుల్లో చేరారు. గతంలో గోవిందరాజస్వామి ఆలయంలో పనిచేసే శానిటరీ ఇన్స్ పెక్టర్ కు కరోనా సోకడంతో ఈ ఆలయాన్ని మూసివేశారు. తిరుమలలో పనిచేసే 15 మంది అర్చకులకు కరోనా సోకిందని తిరుమలలో భక్తులకు దర్శనాలను నిలిపివేయాలని టీటీడీ గౌరవ అర్చకులు  రమణ దీక్షితులు జగన్ ను గతంలో  కోరిన విషయం తెలిసిందే.

click me!