కరోనా నివారణకు టీటీడీ ఆయుర్వేద ఔషధాలు!

By Sree sFirst Published Apr 9, 2020, 1:52 PM IST
Highlights

కరోనా వైరస్ మహమ్మారి భయపెడుతున్న వేళ టీటీడీ కూడా ఈ కరోనా వైరస్ పై పోరాటానికి కొన్ని ఆయుర్వేద మూలికలతో తాయారు చేసిన ద్రావణాలను, మాత్రలను అందుబాటులోకి తెచ్చింది. 

కరోనా వైరస్ కోరలు చేస్తున్న వేళ, ఆ వైరస్ కి మందు లేక జాగ్రత్తలు తీసుకోవడమే శరణ్యంగా భావిస్తున్నారు ప్రజలు, ప్రభుత్వాలు. అందుకోసమే దేశాలకు దేశాలే లాక్ డౌన్ లో ఉండిపోయాయి. 

శానిటైజెర్ల దగ్గరి నుండి వంట్లో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాల వరకు ప్రజలు వాటిని అధికంగా సేవిస్తున్నారు. ఇలా కరోనా వైరస్ మహమ్మారి భయపెడుతున్న వేళ టీటీడీ కూడా ఈ కరోనా వైరస్ పై పోరాటానికి కొన్ని ఆయుర్వేద మూలికలతో తాయారు చేసిన ద్రావణాలను, మాత్రలను అందుబాటులోకి తెచ్చింది. 

క్రిమిసంహారక ధూపాన్ని రక్షజ్ఞ ధూపం అనే పేరుతో తీసుకొచ్చింది. చేతులు శుభ్రపరుచుకోవడానికి పవిత్ర అనే శానిటైజర్ లాంటి ద్రావణాన్ని తీసుకొచ్చింది. గండూషము అనే పుక్కిలించి మందును, నిమ్బనస్యము అనే ముక్కులో వేసుకునే చుక్కల మందును కూడా విడుదల చేసారు. అమృత అనే వ్యాధి నిరోధక శక్తిని పెంచే మాత్రలను కూడా విడుదల చేసారు. 

ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రులు కలిసి వీటిని తయారుచేశాయి. వీటిని మార్కెట్లోకి కూడా విడుదల చేసారు. ఇవి సామయ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడతాయని టీటీడీ అధికారులు తెలిపారు. 

ఇకపోతే ప్రస్తుతం ఏపీలో కరోనా తాకిడి కాస్త తగ్గిందని అధికారులు చెబుతున్నారు. గురువారం నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

Also Read కరోనాపై పోరాటం... ఏపి ఇండస్ట్రీస్‌ కోవిడ్‌ –19 రెస్పాన్స్‌ పోర్టల్‌ ను ఆవిష్కరించిన జగన్...

రాత్రి 9గంటల నుంచి ఉదయం 9గంటల వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. 217 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అన్ని కేసులు నెగటివ్‌గా వచ్చాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 348 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 90 శాతం మంది ఢిల్లీ నుంచి వచ్చిన వారే ఉండడం గమనార్హం.


ఢిల్లీకి వెళ్లొచ్చిన 1000 మంది ప్రయాణికులతో పాటు వారితో కాంటాక్ట్‌ అయిన 2500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా ఇప్పటివరకు 7,155 మందికి పరీక్షలు నిర్వహించగా 348 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. కరోనా నుంచి కోలుకుని 9 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కోటి 42 లక్షల కుటుంబాలకు సర్వే పూర్తి చేశారు. 6289 మందికి అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వారిలో 1750 మంది స్వీయ నిర్బంధంలో ఉంచారు. రోజుకు వెయ్యి మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

click me!