రమణదీక్షితులు, విజయసాయిరెడ్డికి షాక్: నోటీసులిచ్చిన టిటిడి

First Published Jun 13, 2018, 11:34 AM IST
Highlights

లీగల్ యాక్షన్ కు టిటిడి రెడీ


తిరుపతి:  టిటిడి మాజీ ప్రధానార్చకుడు ఏవీ రమణ దీక్షితులు,  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టిటిడి నోటీసులు జారీ చేసింది. టిటిడిపై మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు తీవ్ర విమర్శలు చేశారు. 

ఈ విమర్శలపై టిటిడి వివరణ ఇచ్చింది. అంతేకాదు టిడిపి నేతలు కూడ రమణ దీక్షితులుపై విరుచుకుపడ్డారు మరో వైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడ టిటిడిపై విమర్శలు గుప్పించారు. టిటిడికి చెందిన కొన్ని ఆభరణాలు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నివాసంలో ఉన్నాయని విజయసాయి రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనకు కూడ టిటిడి నోటీసులు ఇచ్చింది.


రమణ దీక్షితులు సమయం దొరికినప్పుడల్లా టిటిడి పరువును తీశారని టిటిడి పాలకవర్గం భావిస్తోంది. వీరిద్దరూ కూడ టిటిడి పరువును గంగలో కలిపారని  భావిస్తున్నందున వీరిద్దరికి నోటీసులు పంపారు. వీరు చేసిన ఆరోపణలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని టిటిడి పాలకవర్గం భావిస్తోంది. వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పాలకవర్గం ఇటీవలనే తీర్మాణం చేసింది. ఇందులో భాగంగానే వీరిద్దరికి నోటీసులు పంపారు. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో వారిని కోరారు.
 

click me!