కరోనా ఎఫెక్ట్: కడప ఒంటిమిట్ట ఆలయం మూసివేత

Published : Apr 16, 2021, 11:55 AM IST
కరోనా ఎఫెక్ట్: కడప ఒంటిమిట్ట ఆలయం మూసివేత

సారాంశం

కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని కోదండరాముని ఆలయాన్ని మూసివేశారు. కరోనా కేసుల పెరుగుదలతో ఆలయాన్ని మూసివేసినట్టుగా అధికారులు ప్రకటించారు.

కడప: కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని కోదండరాముని ఆలయాన్ని మూసివేశారు. కరోనా కేసుల పెరుగుదలతో ఆలయాన్ని మూసివేసినట్టుగా అధికారులు ప్రకటించారు.టీటీడీ అధికారుల ఆదేశం మేరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్టుగా చెప్పారు.  దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీని ప్రభావం ఆలయాలపై కూడ పడుతోంది.  గత ఏడాది మార్చి మాసంలో కూడ ఈ ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. 

మహారాష్ట్రలోని షిర్డీ ఆలయాన్ని ఇప్పటికే మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆలయం తెరవబోమని షీర్డీ సంస్థాన్ ప్రకటించింది.  తిరుమల వెంకన్న దర్శనాలు కొనసాగుతున్నాయి. అయితే సర్వదర్శనం టికెట్ల జారీని అధికారులు నిలిపివేశారు.గత ఏడాదిలో  కరోనా కారణంగా తిరుపతి ఆలయాన్ని కూడ మూసివేసిన విషయం తెలిసిందే. గత ఏడాది మార్చి 23వ తేదీన ఆలయాన్ని మూసివేశారు. మే మాసంలో  ఆలయం తెరిచారు.ఏపీ రాష్ట్రంలో కూడ కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో  వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకుు జగన్ సర్కార్ అప్రమత్తమైంది. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్