పచ్చగా కనపడితే చాలు, కెలికి మరీ తిట్టించుకుంటాడు.. విజయసాయి రెడ్డి

Published : Jun 05, 2020, 12:28 PM IST
పచ్చగా కనపడితే చాలు, కెలికి మరీ తిట్టించుకుంటాడు.. విజయసాయి రెడ్డి

సారాంశం

పచ్చగా ఏది కనపడినా దానిని చంద్రబాబు దోచేస్తాడంటూ ఆయన విమర్శించారు. సంచిత ఆనంద గజపతి అడిగే ఒక్క ప్రశ్నకు కూడా చంద్రబాబు సమాధానం చెప్పలేకపోయాడంటూ ఎద్దేవా చేశారు. 

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కెలికి మరీ తిట్టించుకుంటాడంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. పచ్చగా ఏది కనపడినా దానిని చంద్రబాబు దోచేస్తాడంటూ ఆయన విమర్శించారు. సంచిత ఆనంద గజపతి అడిగే ఒక్క ప్రశ్నకు కూడా చంద్రబాబు సమాధానం చెప్పలేకపోయాడంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో విమర్శల వర్షం కురిపించారు.

‘‘కెలికి మరీ తిట్టించుకోవడం బాబుకు అలవాటే. అధికారంలో ఉన్నన్నాళ్లు అశోక్ గజపతిని ముందు పెట్టి మాన్సాస్ ట్రస్టును సర్వ నాశనం చేశాడు. ఏ సంబంధం లేని కుటుంబరావు, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ ఐవీ రావులను సభ్యులుగా నియమించినప్పుడే అర్థమైంది. దాన్ని కేకు ముక్కలా నాకేస్తాడని.’’ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

 

మరో ట్వీట్ లో...‘‘పేరుకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ. పచ్చగా ఏది కనిపించినా నక్కజిత్తులన్నీ ప్రయోగించి దోపిడీకి తెగబడతాడు. మాన్సాస్ ఛైర్ పర్సన్ సంచిత ఆనంద గజపతి లేవనెత్తిన ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేకపోతున్నాడు. ట్రస్టును భ్రష్టు పట్టించాడు కాబట్టే సైలెంటై పోయాడు. దర్యాప్తులో తప్పించుకోలేడు.’’ అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

10వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami