బిగ్ న్యూస్: జగన్ కేసులో ఈడీకి పెద్ద షాక్

First Published 15, Mar 2018, 11:47 AM IST
Highlights
  • విచారణ చేస్తున్న విధానంపై మండిపడింది.

వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కేసులను విచారిస్తున్న ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి)కి ట్రైబ్యునల్ పెద్ద షాక్ ఇచ్చింది. విచారణ చేస్తున్న విధానంపై మండిపడింది. తగిన సాక్ష్యాలు లేకుండానే ఆస్తులను ఎలా జప్తు చేస్తారంటూ నిలదీసింది. మొత్తం మీద జగన్ అక్రమాస్తుల కేసులను విచారిస్తున్న ఈడికి ట్రైబ్యునల్ వరుసగా షాకుల మీద షాకులిస్తోంది.

తాజాగా జగన్, విజయసాయిరెడ్డి, మాధవ రామచంద్రన్, టిఆర్ కణ్ణన్, ఎకె దండమూడిలను మోసగించి సాక్షిలో పెట్టుబడులు పెట్టించారని ఈడీ చెప్పడంటపై పిఎంఎల్ఎ ట్రిబ్యులన్ ఆశ్చర్యపోయింది. ‘మోసం జరిగింది నిజమే అయితే మరి మోసపోయిన  వాళ్లెందుకు కేసు పెట్టలేద’ని సూటిగా ప్రశ్నించింది. ‘రికవరీ కోసం సివిల్ సూట్ వారు ఎందుకు వేయలేద’ని అడిగింది.

‘ఒకవేళ మోసం నిజమే అనుకున్నా, అది మామూలు చీటింగ్ కేసు అవుతుంది కానీ మనీలాండరింగ్ ఎలా అవుతుంద’న్న  ట్రైబ్యునల్ ప్రశ్నకు ఈడి ని నిలదీసింది. 34.5 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్ల జప్తు చట్ట విరుద్ధమని చీవాట్లు సమాధానం చెప్పలేకపోయింది. దాంతో గతంలో ఈడి చేసిన అటాచ్ మెంట్లను  కొట్టివేసింది. సాక్షిలో 60 మంది ఇన్వెస్ట్ చేస్తే కొందిరి ఆస్తులే ఎందుకు జప్తు చేశారన్న ప్రశ్నకు ఈడీ వద్ద సమాధానమే లేదని ట్రిబ్యునల్ పేర్కొంది.

అరబిందో, హెటిరో ఆస్తుల జప్తు కేసులో కూడా ఈడీ వైఖరిని ట్రిబ్యునల్ తప్పపట్టింది.  అరబిందో, హెటిరో లు 21.5కోట్ల బెనిఫిట్ కోసం 29 కోట్లు లంచం ఇచ్చారని ఈడీ చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రాక్టికల్ గా అలా ఎవరైనా చేస్తారా? అని అడిగింది.

ఒకవేళ నిజమే అయితే, నేరం ద్వారా వచ్చిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులు జప్తు చేయాలి కానీ సంబంధం లేని ఆస్తులను  ఎందుకు సీజ్ చేశారని ప్రశ్నించింది. ఈడీ చర్యలు సమర్థించలేమని పేర్కొంది. అదే సమయంలో కేసు పూర్తయ్యే వరకు ఎఫ్ డీ లు ఇస్తామని తమ భూములు తిరిగివ్వాలని అరిబందో, హెటిరోల విజ్ఞప్తిని  ట్రిబ్యునల్ అంగీకరించింది. ఎఫ్ డీలు తీసుకొని వారి భూములు వాళ్లకు ఇచ్చేయాలని ఆదేశించింది.

 

 

Last Updated 25, Mar 2018, 11:39 PM IST