ఏపీలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఎవరు, ఎక్కడికంటే...

By SumaBala BukkaFirst Published Nov 26, 2022, 11:49 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీలు జరిగాయి. ఈసారి ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

అమరావతి : ఏపీలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. ఎన్. తేజ్ భరత్ ను తూర్పు గోదావరి జిల్లా జేసీగా బదిలీ చేశారు. చామకురి శ్రీధర్ ను ప్రభుత్వం సీసిఎల్ఏలో విజిలెన్స్ జాయింట్ సెక్రటరీ గా పోస్టింగ్ ఇచ్చింది. అపరాజిత సింగ్ కు కృష్ణా జిల్లా జేసీగా పోస్టింగ్ ఇచ్చింది.

మహేష్ కుమార్  పంచాయితీ రాజ్ శాఖ అదనపు కమిషనర్ గా బదిలీ చేసింది. టి.నీశాంతి నంద్యాల జిల్లా జేసిగా పోస్టింగ్, ఎన్. మౌర్య ను సాధారణ పరిపాలన శాఖ కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. మూడు జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లను నియమించారు.

విశాఖ ట్రాఫిక్ పోలీసుల రశీదుపై మతపరమైన కీర్తనలు ఉండటంపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన పోలీసు శాఖ..!

ఇదిలా ఉండగా, అక్టోబర్ 8న ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ చేపట్టింది. అలాగే పలువురు ట్రైనీ ఐఏఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఐఏఎస్ అధికారుల బదిలీల విషయానికి వస్తే..  సివిల్ సప్లై డైరెక్టర్‌గా విజయ సునీత, గ్రామ, వార్డు సచివాలయాల అదనపు డైరెక్టర్‌గా భావన, శ్రీకాకుళం జాయింట్ కలెకర్ట్‌గా మల్లారపు నవీన్, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా విష్ణు చరణ్, మధ్యాహ్నం భోజన పథకం డైరెక్టర్‌గా నిధి మీనా, ఏపీసీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా కట్టా సింహాచలంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ట్రైనీ ఐఏఎస్‌లకు పోస్టింగ్‌ల విషయానికి వస్తే.. 2020 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌లకు సబ్ కలెక్టర్‌లుగా పోస్టింగ్‌లు ఇచ్చారు. తెనాలి సబ్ కలెక్టర్‌గా గీతాంజలి శర్మ, రంపపచోడవరం సబ్ కలెక్టర్‌గా శుభం బన్సల్, నరసాపురం సబ్ కలెక్టర్‌గా మల్లవరకు సూర్యతేజ, టెక్కలి సబ్ కలెక్టర్‌గా రవికుమార్ రెడ్డి, పాలకొండ సబ్ కలెక్టర్‌గా నూరుల్ కమిర్, అదోని సబ్ కలెక్టర్‌గా అభిషేక్ కుమార్, విజయవాడ సబ్ కలెక్టర్‌గా అధితిసింగ్, పెనుకొండ సబ్ కలెక్టర్‌గా కార్తీక్, గుడూరు సబ్ కలెక్టర్‌గా శోభిక, కందుకూరు సబ్ కలెక్టర్‌గా మాధవన్‌లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. 

click me!