ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఢిల్లీలో డొంక కదిలితే.. ఆంధ్రా, తెలంగాణలు షేక్...జీవీఎల్ నరసింహారావు

By Bukka Sumabala  |  First Published Aug 24, 2022, 1:23 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కాం మూలాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలడం ఆశ్చర్యంగా ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. లిక్కర్ స్కామ్ లో రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీకి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. 


విశాఖపట్నం : లిక్కర్ స్కామ్ పై ఢిల్లీలో డొంక కదిలితే ఆంధ్ర,  తెలంగాణలో మూలాలు వెలుగుచూస్తున్నాయి అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్ లో రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీకి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది అన్నారు. దీనిపై రెండు ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ లో  నిబంధనలను తుంగలోకి తొక్కారని ఢిల్లీ చీఫ్ విజిలెన్స్ విభాగం నిర్ధారించింది అని, ఢిల్లీ ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని  జీవీఎల్ నరసింహారావు అన్నారు.

ఎంతో విలువైన లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములు కేవలం రూ. 500 కోట్లకే  ఒక ప్రైవేట్ సంస్థ చేజిక్కించుకుందీ అంటే ఎంత దారుణం? అని జీవీఎల్ నరసింహారావు అన్నారు. జగన్ సర్కారు దీనికి స్పందించదా?  అని ప్రశ్నించారు. భూములను ఏ పర్పస్ కోసం ఇచ్చారని అడిగారు. ల్యాండ్ అగ్రిమెంట్ మీద జరిగిన అంశాలు తెలపాలని డిమాండ్ చేశారు. ఓ ఎమ్మెల్యే కొడుకు సదరు సంస్థలో డైరెక్టర్గా ఉన్నాడని, వారికి ఉండే ఆసక్తి ఏంటో ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అన్నారు. విశాఖలో  పెద్ద సంఖ్యలో ఓటర్లను రద్దు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని,  ఆంధ్రేతర ప్రాంతానికి చెందిన ఓటర్లను కావాలని 50వేల మందిని జాబితాలో నుంచి తొలగించారు అన్నారు. దీనిపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాశామని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.

Latest Videos

undefined

పాదయాత్రకు బ్రేక్.. గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరిన బీజేపీ

ఇదిలా ఉండగా, ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి తనపై బిజెపి ఎంపీ పర్వేశ్ వర్మ, మజీందర్ సిర్సాలు చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఇంజక్షన్ పిటిషన్ దాఖలు చేశారు.  ఢిల్లీ మద్యం పాలసీలో తనపై నిరాధార ఆరోపణలు చేశారని ఆమె ఆ పిటిషన్లో పేర్కొన్నారు. తన పరువుకు భంగం కలిగించే ప్రకటనలు చేశారని..  బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు కవిత.

ఈ స్కామ్ లో తనకు సంబంధం లేకున్నా తనను అభాసుపాలు చేసే ఉద్దేశంతోనే బిజెపి నేతలు ఈ ప్రయత్నాలు చేశారని కవిత సోమవారం నాడు మండిపడ్డారు. తన పై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని కూడా కవిత అన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని కూడా ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆమె ఈ ఇద్దరు నేతలపై మంగళవారం పరువు నష్టం దావా వేశారు. అంతేకాదు ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ నిర్వహించే దర్యాప్తు సంస్థలకు కూడా తాను సహకరిస్తానని కవిత పేర్కొన్నారు. 

click me!