చెక్ బౌన్స్ కేసులో కోర్టుకి బండ్ల గణేష్

Published : Jun 26, 2019, 09:37 AM IST
చెక్ బౌన్స్ కేసులో కోర్టుకి బండ్ల గణేష్

సారాంశం

చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత, మాజీ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కడప జిల్లా ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. 

చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత, మాజీ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కడప జిల్లా ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. ప్రొద్దుటూరుకు చెందిన సుమారు 60 మంది బండ్ల గణేష్ కి పెద్దమొత్తంలో అప్పు ఇచ్చారు. ఆ డబ్బులకు సంబంధించి బండ్ల గణేష్‌ ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అయ్యాయి. 

దీంతో బండ్ల గణేష్ కి అప్పు ఇచ్చిన వారంతా  ప్రొద్దుటూరు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులకు సంబంధించి గతంలోను బండ్ల గణేష్‌ ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. మంగళవారం తిరిగి ఆ చెక్‌బౌన్స్‌ కేసులకు సంబంధించి వాయిదా ఉండటంతో ఆయన హైదరాబాదు నుంచి వచ్చి, ప్రొద్దుటూరు కోర్టులో మెజిస్ట్రేట్‌ ముందు హాజరయ్యారు. ఈ కేసులను ఆగస్టు 7వ తేదీకి మేజిస్ర్టేట్‌ వాయిదా వేశారు.

PREV
click me!

Recommended Stories

శ్రీ సిటీలో బాయిలర్ పేలుడుతో మాకు ఎలాంటి సంబంధం లేదు.. ట్యాబ్లెట్ ఇండియా క్లారిటీ
చంద్రబాబుపై శివరాజ్ సింగ్ పొగడ్తలు | Shivraj Singh Speech | Asianet Telugu