Chandrababu Cases : చంద్రబాబుపై కేసులే కేసులు..! ఆ కేసును రీఓపెన్ చేయాలంటూ హైకోర్టుకు సిఐడి 

By Arun Kumar PFirst Published Nov 22, 2023, 9:28 AM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై కేసులమీద కేసులు పెట్టిస్తోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఈ కేసుల్లో అరెస్ట్ నుండి తప్పించుకునేందుకు చంద్రబాబు కూడా హైకోర్టులో వరుసగా ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని అవినీతి కేసులు వెంటాడుతున్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడిందని జగన్ సర్కార్ ఆరోపిస్తోంది. ఇలా కేవలం ఆరోపణలు చేయడమే కాదు చంద్రబాబుపై దర్యాప్తు సంస్థలతో కేసులు కూడా పెట్టిస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి దాదాపు 50 రోజుల పైనే జైల్లో పెట్టారు.  తాజాగా బెయిల్ రావడం చంద్రబాబుకు కాస్త ఊరటనిస్తున్నా ఇంకా అనేక కేసులు ఆయనను వెంటాడుతున్నాయి. స్కిల్ కేసులో మాదిరిగా ఆ కేసుల్లో మళ్ళీ అరెస్ట్ కాకుండా చంద్రబాబు ముందుగానే జాగ్రత్త తీసుకుంటున్నారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండగా మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని వైసిపి ఆరోపిస్తోంది. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసేలా చంద్రబాబు వ్యవహరించారంటున్న వైసిపి ప్రభుత్వం సిఐడి దర్యాప్తుకు ఆదేశించింది. మద్యం పాలసీ విషయంలో అక్రమాలు జరిగింది వాస్తమేనని తమ దర్యాప్తులో తేలినట్లు సిఐడి చెబుతోంది. తమకు కావాల్సిన వారికోసం ఆనాటి సీఎం, ఎక్సైజ్ మంత్రి నిబంధనలు మార్చారని సిఐడి ఆరోపిస్తోంది. ఏపీ లిక్కర్ స్కాంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారంటూ ఇప్పటికే ఈ ఇద్దరిపై కేసు నమోదు చేసారు. దీంతో ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా వుండేందుకు చంద్రబాబు దాఖలుచేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.  

Latest Videos

నిన్న(మంగళవారం) కూడా ఈ మద్యం కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. నిన్నంతా చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదన విన్న న్యాయస్థానం నేడు సిఐడి లాయర్ల వాదనలు విననుంది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఎందుకు ఇవ్వాలో ఆయన లాయర్లు వాదిస్తే... ఎందుకు ఇవ్వకూడదో నేడు సిఐడి లాయర్లు వాదించనున్నారు. మధ్యాహ్నం 2:15 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. 

Read More  andhra pradesh fiber grid case:ఏడుగురు నిందితుల ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్

మద్యం పాలసీ విషయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని నిన్న చంద్రబాబు లాయర్లు న్యాయస్థానానికి వివరించారు. సిఐడీ చేసిన అభియోగాలపై ఎలాంటి ఆధారాలు లేవన్నారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై వరుస కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. 17A అమ్మైండ్మెంట్ యాక్ట్ ఈ కేస్ కు వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. 

ఇక ఇసుక విషయంలోనూ చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ మరో కేసు నమోదయ్యింది. ఈ కేసులో కూడా ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించగా  నేడు విచారణ జరగనుంది. ఉచిత ఇసుక స్కీమ్ ద్వారా చంద్రబాబు అక్రమాలకు పాల్పడినట్టు కేసు నమోదు చేసిన సీఐడి ఆయన బెయిల్ పిటిషన్ పైనా కౌంటర్ దాఖలు చేసింది.  ఈ కేసులో ఏ1 గా పీతల సుజాత, ఏ2 గా చంద్రబాబు, ఏ3 గా చింతమనేని ప్రభాకర్, ఏ4 గా దేవినేని ఉమ వున్నారు. 

ఇదిలావుంటే అమరావతి అసైండ్ భూముల విషయంలో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ అక్రమాలకు పాల్పడినట్లు సిఐడి ఆరోపిస్లోంది. ఈ కేసుపై ఇప్పటికే విచారణ పూర్తవగా దీన్ని రీఓపెన్ చేయాలని  సిఐడి హైకోర్టును కోరింది. ఇలా సిఐడి దాఖలుచేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది.  

ఇక మద్యం కేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరపనుంది. జస్టిస్ మల్లికార్జున్ రావు బెంచ్  ఇవాళ మధ్యాహ్నం ఈ బెయిల్ పిటిషన్ ను విచారించనుంది. 

 
 

click me!