ఏపి కరోనా అప్ డేట్స్: గోదావరి, కృష్ణా జిల్లాలే టాప్,మొత్తం 2745 పాజిటివ్ కేసులు

By Arun Kumar P  |  First Published Nov 5, 2020, 7:13 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో గత 24గంటల్లో 245 కరోనా కేసులు నమోదయ్యాయి.  


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో గత 24గంటల్లో 2,745 కరోనా కేసులు నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 85,364మందికి పరీక్షలు నిర్వహించగా తాజా కేసులు బయటపడినట్లు వెల్లడించారు.  తాజా కేసులతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 835953కు చేరగా టెస్టుల సంఖ్య 84,27,629కు చేరింది. 

ఇక మరణాల విషయానికి వస్తే తాజాగా 13మంది మృతిచెందారు. చిత్తూరు ఇద్దరు, కృష్ణా ముగ్గురు, విశాఖ ఇద్దరు, అనంతపూర్ ఒకరు, తూర్పు గోదావరి ఒకరు, గుంటూరు ఒకరు, ప్రకాశం ఒకరు, శ్రీకాకుళం ఒకరు, పశ్చిమ గోదావరి ఒకరు మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6,757 కు చేరింది. 

Latest Videos

undefined

రికవరీ విషయానికి వస్తే గత 24గంటల్లో 2,292మంది కరోనా నుండి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 804423కు చేరింది. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య  21878కు చేరింది.  

జిల్లాలవారిగా కేసులను పరిశీలిస్తే తూర్పు గోదావరి 407, పశ్చిమ గోదావరి 428, కృష్ణా 398 కేసులు బయటపడ్డాయి. ఇక చిత్తూరు 286, అనంతపూర్ 218, గుంటూరు 207, కడన 125, కర్నూల్ 38, నెల్లూరు 130, ప్రకాశం 124, శ్రీకాకుళం 91, విశాఖపట్నం 120, విజయనగరం 83 కేసులు నమోదయ్యాయి.  

పూర్తి వివరాలు:

: 05/11/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,33,058 పాజిటివ్ కేసు లకు గాను
*8,04,423 మంది డిశ్చార్జ్ కాగా
*6,757 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 21,878 pic.twitter.com/DTJoMlPKHY

— ArogyaAndhra (@ArogyaAndhra)


  

click me!