రుయా ఆస్పత్రిలో మారని సిబ్బంది తీరు.. డబ్బులిస్తే గానీ సేవలు అందడం లేదని పేషెంట్ ఆవేదన..

Published : May 08, 2022, 09:30 AM IST
రుయా ఆస్పత్రిలో మారని సిబ్బంది తీరు.. డబ్బులిస్తే గానీ సేవలు అందడం లేదని పేషెంట్ ఆవేదన..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చోటుచేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం తప్ప ఆస్పత్రి సిబ్బంది తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. 

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చోటుచేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం తప్ప ఆస్పత్రి సిబ్బంది తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. రాయలసీమలోనే పెద్ద ఆస్పత్రిగా పేరుపొందిన తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చోటుచేసుకుంటున్న ఘటనలు చూస్తే ఇది నిజం అనిపించక మానదు. రుయా ఆస్పత్రిలో ఇటీవల అంబులెన్స్‌ల దందా వెలుగుచూడటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 

అయితే తాజాగా ఆస్పత్రికి వచ్చే పేషెంట్లతో సిబ్బంది ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో తెలిపే ఘటన ఒకటి వెలుగుచూసింది. వైద్యానికి డబ్బులు ఖర్చు చేసే స్థోమత లేని నిరుపేదలే ఎక్కువగా ఉంటారు. అలాంటి వారి నుంచి ఆస్పత్రి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల పుత్తూరుకు చెందిన నాగరత్న ఆపరేషన్ కోసం రుయా ఆస్పత్రికి రాగా.. అక్కడి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారు.

ఆపరేషన్‌కి ముందు పనిచేసేవాళ్లకు పలు రకాలుగా డబ్బులు చెల్లించాల్సి వస్తుందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు లేవని చెబితే ఎంతో కొంత ఇవ్వమని ఒత్తిడి చేసినట్టుగా చెప్పారు. డాక్టర్స్ బాగానే చేస్తున్నప్పటికీ.. మెడిసిన్ బయట తెచ్చుకోవాల్సి వస్తుందన్నారు. ఈ క్రమంలోనే బాధితురాలు సిబ్బందికి గూగుల్ పే చేసి..  ఆ స్క్రీన్ షాట్ అధికారులకు పంపించారు. బాధితురాలి ఫిర్యాదుతో విచారించి ఇద్దరు సిబ్బందిపై రుయా సూపరింటెండెంట్ భారతి వేటు వేశారు.

అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది ఇలా డబ్బులు డిమాండ్ చేయడంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు