తిరుపతి రుయా ఆసుపత్రి ఘటన : జగన్ సర్కార్ కు షాకిచ్చిన హైకోర్టు..

Published : Jun 28, 2021, 02:46 PM IST
తిరుపతి రుయా ఆసుపత్రి ఘటన : జగన్ సర్కార్ కు షాకిచ్చిన హైకోర్టు..

సారాంశం

అమరావతి : తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం, ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఘటన చోటుచేసుకుందని పిటిషనర్ తరుపు న్యాయవాది యలమంజుల బాలాజీ ఆరోపించారు. 

అమరావతి : తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం, ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఘటన చోటుచేసుకుందని పిటిషనర్ తరుపు న్యాయవాది యలమంజుల బాలాజీ ఆరోపించారు. 

అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు FIR నమోదు కాలేదని న్యాయవాద యలమంజుల బాలాజీ విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ఎంత మంది చనిపోయారో కూడా ఇంతవరకు స్పష్టత లేదని న్యాయవాది యలమంజుల అన్నారు.

అంతేకాదు ఎక్స్ గ్రేషియా లో ప్రభుత్వం అసమానతలు పాటించదన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో  మృతులకు కోటిరుపాయలు, తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనలో మృతులకు 10 లక్షలు ప్రకటించిందని న్యాయవాది తెలిపారు.

అలా ఇష్టం వచ్చినట్లు ఎక్స్ గ్రేషియా ప్రకటించడానికి రాచరికం కాదన్న న్యాయవాది యలమంజుల బాలాజీ అన్నారు. ఎక్స్ గ్రేషియా మీద మార్గదర్శకాలను రూపొందించి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలన్న న్యాయవాది బాలాజీ అన్నారు. 

ఈ ఘటన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్న న్యాయవాది వాదనలతో  హైకోర్టు ఏకీభవించింది.  ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయినట్తు విచారణలో తేలిందని ప్రభుత్వం తరుపు న్యాయవాది తెలిపారు.

రుయా ఆసుపత్రి ఘటనలో ఆక్సిజన్ అందక చనిపోయారా? ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యమో తేల్చాల్సిన బాధ్యత ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిమీద కౌంటర్ ధాఖలు చేయాలని ప్రభుత్వం, పోలీసులు, ఆసుపత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.  తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్