చేదు అనుభవం: మహాశాంతి యాగంలో ఎమ్మెల్యే సుగుణమ్మకు నో చెప్పిన టీటీడీ

Published : Aug 15, 2018, 05:18 PM ISTUpdated : Sep 09, 2018, 11:34 AM IST
చేదు అనుభవం: మహాశాంతి యాగంలో ఎమ్మెల్యే సుగుణమ్మకు నో చెప్పిన టీటీడీ

సారాంశం

తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు బుధవారం నాడు చేదు అనుభవం ఎదురైంది. టీటీడి అధికారుల తీరును నిరసిస్తూ  తిరుమల మహాద్వారం వెలుపల ఎమ్మెల్యే సుగుణమ్మ భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. టీటీడీ అధికారుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుపతి: తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు బుధవారం నాడు చేదు అనుభవం ఎదురైంది. టీటీడి అధికారుల తీరును నిరసిస్తూ  తిరుమల మహాద్వారం వెలుపల ఎమ్మెల్యే సుగుణమ్మ భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. టీటీడీ అధికారుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహాసంప్రోక్షణలో భాగంగా బుధవారం నాడు మహాశాంతి యాగాన్ని నిర్వహించారు.ఈ మహాశాంతి యాగంలో పాల్గొనేందుకు గాను తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ వచ్చారు. అయితే ఎమ్మెల్యే సుగుణమ్మకు అనుమతి లేదని టీటీడీ అధికారులు చెప్పారు.

అంతేకాదు అనుమతి లేనందున టీటీడీ అధికారులు  ఎమ్మెల్యే సుగుణమ్మను మహాశాంతి యాగంలో పాల్గొనకుండా అడ్డుకొన్నారు. దీంతో  సుగుణమ్మ టీటీడీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీటీడీ అధికారుల తీరును నిరసిస్తూ  తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వెలుపల  ఆమె బైఠాయించి ధర్నాకు దిగారు.  తనకు టీటీడీ అధికారులు సరైన సమాధానం ఇవ్వాలని ఆమె పట్టుబట్టారు.

 

PREV
click me!

Recommended Stories

Rain Alert: వాయుగుండంగా మారిన అల్పపీడ‌నం.. ఈ ప్రాంతాల్లో వ‌ర్షాలే వ‌ర్షాలు
YS Jagan Pressmeet: చంద్రబాబు, పవన్ పై జగన్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu