యస్ బ్యాంక్‌ సంక్షోభం: టీటీడీ ముందు జాగ్రత్త.. అక్టోబర్‌లోనే రూ.1,300 కోట్లు విత్ డ్రా

By Siva KodatiFirst Published Mar 6, 2020, 10:12 PM IST
Highlights

యస్ బ్యాంక్ సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన తిరుమల తిరుపతి దేవస్థానం అందులో డిపాజిట్ చేసిన రూ.1,300 కోట్లను అక్టోబర్ నెలలోనే విత్ డ్రా చేసింది. 

యస్ బ్యాంక్ సంక్షోభం ప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగంలో కలకలం సృష్టించింది. ఆర్‌బీఐ ఈ బ్యాంక్‌పై కఠిన ఆంక్షలు విధించడంతో అందరిచూపు ఈ బ్యాంక్‌పై నెలకొంది. అదే సమయంలో ఫోన్ పే సేవలు సైతం నిలిచిపోవడంతో సామాన్యులకు ఏమి అర్ధం కాలేదు.

యస్ బ్యాంక్ ఖాతాదారులు నెల రోజుల్లోపు రూ.50 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకోవాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. అయితే మరి కోట్ల రూపాయలు డిపాజిట్ చేసిన వారి పరిస్ధితి ఏంటనే అనుమానం కలగకమానదు.

Also Read:మీ డబ్బు ఎక్కడికి పోదు, భద్రంగా ఉంది : ఆర్థిక మంత్రి

యస్ బ్యాంక్ సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన తిరుమల తిరుపతి దేవస్థానం అందులో డిపాజిట్ చేసిన రూ.1,300 కోట్లను అక్టోబర్ నెలలోనే విత్ డ్రా చేసింది. టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి బోర్డు వివిధ బ్యాంకుల్లో చేసిన శ్రీవారి డిపాజిట్లపై దృష్టి సారించారు.

అప్పటికే యస్ బ్యాంక్ ఆర్ధిక పరిస్ధితులు బాగోలేకపోవడంతో వెంటనే టీటీడీ డిపాజిట్లను వెనక్కి తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో టీటీడీ నిధులను 4 ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:యెస్ బ్యాంక్ దివాళా...? ఖాతాదారుల ఆందోళన....

గత ఏప్రిల్ నాటికి వివిధ బ్యాంకుల్లో టీటీడీ నిధులు రూ.12,000 కోట్లకు చేరాయి. 2020-21 ఆర్ధిక సంవత్సరం నాటికి ఈ డిపాజిట్లపై రూ.706 కోట్ల ఆదాయాన్ని బోర్డు అంచనా వేసింది. 

click me!