తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం.. స్వర్ణ రథంపై స్వామివారి ద‌ర్శ‌నం

Google News Follow Us

సారాంశం

Tirumala: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల మొద‌టి రోజున స్వ‌ర్ణ ర‌థంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు. ఆదివారం రాత్రి నుంచి ఈ నెల 23 వరకు జరిగే వేడుకల్లో భాగంగా ఉదయం, రాత్రి వేళల్లో స్వామివారికి వాహన సేవలు అత్యంత‌ వైభవంగా జ‌రుగుతాయ‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) వ‌ర్గాలు వెల్ల‌డించాయి.
 

Tirumala Navratri Brahmotsavams: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల మొద‌టి రోజున స్వ‌ర్ణ ర‌థంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు. ఆదివారం రాత్రి నుంచి ఈ నెల 23 వరకు జరిగే వేడుకల్లో భాగంగా నిత్యం ఉదయం, రాత్రి వేళల్లో స్వామివారికి వాహన సేవలు అత్యంత‌ వైభవంగా జ‌రుగుతాయ‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

వివ‌రాల్లోకెళ్తే.. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రస్తుతం వైభవంగా జరుగుతున్నాయి. తొలిరోజు స్వర్ణరథంపై అమ్మవారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరగనుందని టీటీడీ వ‌ర్గాలు తెలిపాయి. ఈ నెల 23వ తేదీ వరకు ఉత్సవాల్లో భాగంగా ఉదయం, సాయంత్రం స్వామివారికి వివిధ వాహనసేవలు ఘ‌నంగా నిర్వహించనున్నారు.

న‌వ‌రాత్రి బ్రహ్మోత్స‌వాల సందర్భంగా తిరుమల క్షేత్రాన్ని విద్యుత్ దీపాలు, పూల తోరణాలతో అలంకరించారు. శ్రీవారి ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ముఖ్యంగా విజయవాడకు చెందిన కృష్ణ అనే కళాకారుడు బెల్ పెప్పర్స్, బెండకాయలు, ముల్లంగి, చెర్రీ టొమాటోలను ఉపయోగించి శ్రీ మహాలక్ష్మి దేవి అద్భుతమైన శిల్పాన్ని రూపొందించారు, ఇది టీటీడీ ఫోటో ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించబడిందని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 

ఈ ఉత్సవాలతో పాటు ఏడాది పొడవునా యాత్రికులు సాధారణంగా ఉపయోగించే అలిపిరి, నడక మార్గాలను కూడా అలంకరించి ప్రదర్శించారు. సందర్శకులకు మంత్రముగ్ధులను చేసే విధంగా తిరుమల ఆలయంలో అటవీ శాఖ అద్భుతమైన దృశ్యాలను ఏర్పాటు చేసింది.

Read more Articles on