తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కరోజు హుండీ ఆదాయంలో రికార్డ్ సాధించింది. ఒక్కరోజూ దాదాపు ఎనిమిది కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
తిరుపతి : నూతన సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం అత్యధిక హుండీ ఆదాయంతో శుభారంభాన్ని ప్రారంభించింది. జనవరి 2న వైకుంఠ ఏకాదశి రోజున ఇప్పటివరకు తిరుమల చరిత్రిలోనే అత్యధికంగా రూ.7.6 కోట్ల హుండీ సేకరణను నమోదయ్యింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయమైన తిరుమల తిరుపతి దేవస్థానం 2023 కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికినట్లైంది.
ఏడుకొండల స్వామివారి దివ్య ఆశీస్సులతో నూతన సంవత్సరాన్ని అత్యంత పవిత్రంగా ప్రారంభించాలనుకున్న వేలాది మంది భక్తులు డిసెంబర్ 31 నుంచే తిరుమలకు క్యూకట్టడంతో తిరుమలలో యాత్రికుల రద్దీ తారాస్థాయికి చేరుకుంది.
undefined
కొత్త సంవత్సరం వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి ఉత్సవాలతో కలిసి రావడంతో, తిరుమల దేవస్థానానికి సోమవారం అత్యధికంగా ఒక్క రోజు హుండీ కలెక్షన్ రూ.7.6 కోట్లు వచ్చింది. అంతకుముందు 2022 అక్టోబర్ 23న గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఒకే రోజు రూ.6.3 కోట్ల హుండీ వసూళ్లు నమోదయ్యాయని టీటీడీ వర్గాలు గమనించాయి.
టీటీడీ తిరుమలలోని దేవస్థానంతో పాటు.. దేశ వ్యాప్తంగా ఐదు డజన్లకు పైగా ఆలయాలను నిర్వహిస్తోంది. టీటీడీ తన దేవాలయాల్లోని హుండీ సేకరణలలో ఒక నమూనా మార్పును చూసింది. హుండీ ఆదాయం 2012-2022 మధ్య దశాబ్దంలో దాదాపు రెట్టింపు అయింది. ఒక నెలలో అనేక ఇతర ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలలో వచ్చిన సగటు హుండీ సేకరణ/విరాళాలు నెలకు సుమారుగా రూ. 4-5 కోట్లు లేదా అంతకంటే తక్కువగా ఉండగా, తిరుమల ఆలయంలో ఒక్క రోజు సగటు హుండీ సేకరణలు సుమారు రూ. 4 నుండి 6 కోట్ల వరకు ఉంటాయి.
తిరుమలకు రోజూ వచ్చే భక్తులు, వారు సమర్పించే హుండీ ఆదాయాన్ని, కానుకల్ని బట్టి కాస్త అటూ ఇటూగా మారుతుంది. అందుకే టీటీడీ మిగతా దేవాలయాలకంటే భిన్నం. అంతేకాదు తమ ఇష్టదైవాన్ని సందర్శించుకోవడానికి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి భక్తులు ఇక్కడి దాకా చేరుకుంటారు. తిరుపతి బాలాజీని చూడాలంటే ఆయననుంచి పిలుపు రావాలని కూడా భావిస్తారు.
కోవిడ్-19 ప్రభావానికి ముందు తిరుమల ఆలయంలో నెలవారీ సగటు హుండీ సేకరణ దాదాపు రూ. 90 నుండి 115 కోట్లుగా ఉండేది. ఇక నిరుడు ఏప్రిల్ లో కోవిడ్-19 ఆంక్షలు పూర్తిగా ఎత్తివేశాక.. లార్డ్ బాలాజీ గుడి నెలవారీ హుండీ వసూళ్లు అధిక స్థాయిలో ఉంటున్నాయి.