ఈ నెల‌ 21, 22 తేదీల్లో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు : టీటీడీ

Published : Mar 12, 2023, 10:08 AM IST
ఈ నెల‌ 21, 22 తేదీల్లో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు : టీటీడీ

సారాంశం

Tirupati: మార్చి 21, 22 తేదీల్లో తిరుమల ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఈనెల 22న‌ తెలుగు సంవత్సరాది ఉగాది (శ్రీ శోభకృత్ నామ సంవత్సరం) ఉండ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు సంబంధిత అధికారులు వెల్ల‌డించారు.  

Tirumala temple-VIP break darshan: మార్చి 21, 22 తేదీల్లో తిరుమల ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఈనెల 22న‌ తెలుగు సంవత్సరాది ఉగాది (శ్రీ శోభకృత్ నామ సంవత్సరం) ఉండ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు సంబంధిత అధికారులు వెల్ల‌డించారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఈనెల 22న‌ తెలుగు సంవత్సరాది ఉగాది (శ్రీ శోభకృత్ నామ సంవత్సరం) పండగ నేపథ్యంలో తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేశారు. ఈ మేర‌కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. తెలుగు సంవత్సరాది ఉగాది 22న (శ్రీ శోభకృత్ నామ సంవత్సరం) ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే వీఐపీ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేస్తున్న‌ట్టు టీటీడీ ప్ర‌క‌టించింది.   21, 22 తేదీల‌కు  సంబంధించి ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. 

ఈ నెల 22న పవిత్ర చైత్ర శుద్ధ పాడ్యమి రోజున శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.  ఆనవాయితీ ప్రకారం ఈ నెల 21వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆలయ శుద్ది కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 22న ఆలయంలో ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తుండగా, వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రెండు రోజుల పాటు (మార్చి 21, 22 తేదీల్లో) నిలిపివేయనున్న‌ట్టు టీటీడీ ప్ర‌క‌టించింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సుప్రభాత సేవ అనంతరం ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు.

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి, విష్వక్సేనులకి విశేష సమర్పణ ఉద‌యం 6 గంట‌ల‌కు ఉంటుంద‌నీ, అలాగే, 7 నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ తెలిపింది. ఈ కార్య‌క్ర‌మాలు ముగిసిన త‌ర్వాత స్వామి మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను క‌డ‌తారు. ప్ర‌త్యేక పూజ‌ల అనంత‌రం పంచాంగ శ్రవణం ఉంటుంది. ఉగాది రోజున (మార్చి 22) తిరుమ‌ల ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, ఊంజల్‌ సేవలు ర‌ద్దు చేస్తున్న‌ట్టు టీటీడీ ప్ర‌క‌టించిన విష‌యాన్ని భ‌క్తులు గ‌మ‌నించాల‌ని సంబంధిత అధికార వ‌ర్గాలు తెలిపాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu