టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే: 23 ఎంపీ సీట్లలో వైసీపీ విజయదుందుభి

Published : Jan 30, 2019, 08:13 PM ISTUpdated : Jan 30, 2019, 08:14 PM IST
టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే: 23 ఎంపీ సీట్లలో వైసీపీ విజయదుందుభి

సారాంశం

తాజాగా టైమ్స్‌ నౌ-వీఎంఆర్‌ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన సర్వే కూడా వైసీపీదే విజయం తథ్యమంటూ వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్ఆర్ సీపీకి 23 సీట్లలో విజయకేతనం ఎగరవేస్తుందని తెలిపింది. 

హైదరాబాద్‌: 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగిస్తోందని ఓ సర్వే స్పష్టం చేసింది. ఇప్పటికే పలు సంస్థలు వెల్లడించిన సర్వేల్లో వైసీపీ 19 పార్లమెంట్ స్థానాలను గెలుస్తోందని స్పష్టం చెశాయి. 

తాజాగా టైమ్స్‌ నౌ-వీఎంఆర్‌ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన సర్వే కూడా వైసీపీదే విజయం తథ్యమంటూ వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్ఆర్ సీపీకి 23 సీట్లలో విజయకేతనం ఎగరవేస్తుందని తెలిపింది. 

అధికార తెలుగుదేశం పార్టీ కేవలం రెండు సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని సర్వే తేల్చింది. అటు జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క స్థానంలో కూడా గెలుచుకోలేవని స్పష్టం చేసింది. ఇక ఓట్ల శాతం పరంగా చూస్తే వైసీపీ, టీడీపీల మధ్య భారీ స్థాయిలో ఓట్ల వ్యత్యాసం ఉందని సర్వేలో తేలింది. 

వైసీపీకి 49.5 శాతం ఓట్లు, టీడీపీకి 36 శాతం ఓట్లు పడతాయని స్పష్టం చేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా ఏపీలో టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు గెలుచుకున్నాయి. వైసీపీ ఏపీలో 8 స్థానాలను గెలుచుకుంది.  

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu