ఏపికి పొంచివున్న ప్రమాదం...అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ

By Arun Kumar PFirst Published Sep 13, 2018, 7:37 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందును ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం కూడా స్పందించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
 
ముఖ్యంగా తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం, అడ్డతీగల, తాళ్లరేవు, ముమ్మడివరం, కృష్ణా జిల్లా విజయవాడ అర్బన్, రూరల్, బాపులపాడు, నూజివీడు, ఆగిరిపల్లి, జి.కొండూరు, గుంటూరు జిలాల్లో గుంటూరు అర్బన్, పెదకాకాని, మేడికొండూరు, నెల్లూరు జిల్లా వెంకటగిరి, బాలాయపల్లి, చిత్తూరు జిల్లా తొట్టంబేడు, కార్వేటినగర్, వెదురుకుప్పం, పెనుమూరులో పిడుగులు పడవచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. అందువల్ల ఈ ప్రాంతాల్లో ప్రజలు కాస్తా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.  

click me!