షాపింగ్ కి వచ్చి తల్లీకూతురు దుర్మరణం

By rajesh yFirst Published Sep 13, 2018, 5:31 PM IST
Highlights

వినాయకచవిత సందర్భంగా కొత్త బట్టలు కావాలని కూతురు తల్లిని అడిగింది. కూతురు ముచ్చట తీర్చేందుకు ఆ తల్లి ద్విచక్రవాహనంపై షాపింగ్ కు తీసుకెళ్లింది. నూతన వస్త్రాలు కొనుగోలు చేసి తిరిగిప్రయాణిస్తుండగా లారీ వారి పాలిట మృత్యువుగా మారింది. 
 

రాజమహేంద్రవరం: వినాయకచవిత సందర్భంగా కొత్త బట్టలు కావాలని కూతురు తల్లిని అడిగింది. కూతురు ముచ్చట తీర్చేందుకు ఆ తల్లి ద్విచక్రవాహనంపై షాపింగ్ కు తీసుకెళ్లింది. నూతన వస్త్రాలు కొనుగోలు చేసి తిరిగిప్రయాణిస్తుండగా లారీ వారి పాలిట మృత్యువుగా మారింది. 

వెనుక నుంచి వచ్చి ఢీకొట్టి ఆ ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. పండుగపూట ధరించాల్సిన బట్టలు మృతదేహాలపై కప్పాల్సి వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అందరి హృదయాలను కలచివేస్తున్న ఈ ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే ఏలేశ్వరం గ్రామానికి చెందిన తల్లి కుమార్తెతో కలిసి తాళ్లూరు షాపింగ్ కు వచ్చింది. షాపింగ్ పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగి పయనమయ్యారు. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ద్విచక్రవాహనాన్ని దాదాపు 200 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లడంతో తల్లికూతురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.   

click me!