వైఎస్సార్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. భోజనం చేస్తున్న కూలీలపైకి దూసుకొచ్చిన టిప్పర్.. ముగ్గురు మృతి..

Published : Jan 12, 2023, 12:02 PM IST
వైఎస్సార్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. భోజనం చేస్తున్న కూలీలపైకి దూసుకొచ్చిన టిప్పర్.. ముగ్గురు మృతి..

సారాంశం

వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్ అదుపుతప్పి రోడ్డు పక్కన భోజనం చేస్తున్న కూలీలపైకి దూసుకెళ్లింది.

వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మలమడుగు మండలంలో గొరిగినూరు దగ్గర రోడ్డు పక్కన భోజనం చేస్తున్న కూలీలపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు కూలీలు, టిప్పర్ డ్రైవర్ ఉన్నారు. అతి వేగం వల్లే టిప్పర్ అదుపుతప్పినట్టుగా భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేసుకుని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అక్కడున్నవారిని అడిగి తెలుసుకున్నారు. 

మృతులను ధర్మాపురం గ్రామానికి చెందిన నాగ సుబ్బరాయుడు, గొరగనూరు గ్రామానికి చెందిన ఓబులేసు లుగా పోలీసులు గుర్తించారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Independence Day 2026 : చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్.. ఇకపై మీ ఇంటి ఖర్చులు పెరగవు
స్వాతంత్య్ర వేడుకల్లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Pawan Kalyan Speech Independence Day 2026