ఎన్టీఆర్ జిల్లా వీటీపీఎస్‌లో ప్రమాదం.. వైర్ తెగిపడటంతో కిందపడ్డ లిఫ్ట్.. ముగ్గురు మృతి..

Published : Mar 18, 2023, 11:06 AM IST
ఎన్టీఆర్ జిల్లా వీటీపీఎస్‌లో ప్రమాదం.. వైర్ తెగిపడటంతో కిందపడ్డ లిఫ్ట్.. ముగ్గురు మృతి..

సారాంశం

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వీటీపీఎస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వీటీపీఎస్‌లో చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వీటీపీఎస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వీటీపీఎస్‌లో చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. వీటీపీఎస్‌లో లిఫ్ట్ వైర్ తెగిపడింది. దీంతో లిఫ్ట్ అమాంతం కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదం  జరిగిన సమయంలో లిఫ్ట్‌లో 8 మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 


 

PREV
click me!

Recommended Stories

Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu